Tuesday, February 4, 2025
HomeఆటBumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బిగ్ షాక్.. తగ్గని బుమ్రా గాయం..!

Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బిగ్ షాక్.. తగ్గని బుమ్రా గాయం..!

ఇంగ్లండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను 4-1 తేడాతో గెలిచిన టీమిండియా.. వన్డే సిరిస్ కు సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 6 నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ టోర్నీ.. ఆటగాళ్లకు ఎంతో ముఖ్యం. అయితే తాజాగా మంగళవారం భారత వన్డే జట్టు ప్రకటించినప్పుడు బుమ్రా పేరు జట్టులో లేదు. బుమ్రా గాయం కారణంగా ఈ సిరీస్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు కోసం అది పెద్ద టెన్షన్‌గా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదో టెస్టు సమయంలో బుమ్రా గాయపడ్డాడు. అప్పటి నుంచి బుమ్రా వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.

- Advertisement -

జట్టు నుంచి బుమ్రా పేరును తొలగించడంపై.. బీసీసీఐ అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే జనవరిలో బీసీసీఐ జట్టును ప్రకటించినప్పుడు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బుమ్రా మొదటి రెండు వన్డేల్లో ఆడుతాడని తెలిపారు. కానీ ఇప్పుడు బుమ్రా సిరీస్ మొత్తం దూరంగా ఉంటాడని అంటున్నారు. ఇక ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో వెన్ను కండరాల నొప్పి కారణంగా బుమ్రా రెండవ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు.

అతనికి ఐదు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. BGTలో బుమ్రా అద్భుత బౌలింగ్ తో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. బుమ్రా త్వరగా కోలుకుని ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలని అభిమానులు భావించారు.. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే అలా కనిపించడం లేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి తుది జట్టు ఫిబ్రవరి 11 నాటికి ఐసీసీకి సమర్పించాలి. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. మరి ఈ టోర్నమెంట్ లో బుమ్రా లేకుండా బరిలోకి దిగడం టీమిండియాకు ఏమాత్రం మంచిది కాదు. బుమ్రా ఛాంపియన్ ట్రోఫీ లో ఆడతాడో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News