ICC Test Rankings| ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరోసారి మెరిశాడు. తాజాగా విడుదల చేసిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 890 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ 856 పాయింట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజల్ వుడ్ 851 పాయింట్లతో మూడు స్థానంలో నిలిచారు. ఇక భారత ఆటగా౩ళ్లు రవిచంద్రన్ అశ్విన్ 797 పాయింట్లతో 5వ స్థానంలో, రవీంద్ర జడేజా 786 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్(Harry Brook) తొలి స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండు టెస్టు మ్యాచులలో వరుస సెంచరీలతో అదరగొట్టాడు. దీంతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. ఇక మరో ఇంగ్లీష్ స్టార్ ఆటగాడు జో రూట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఆటగాడు యశస్వి జైశ్వాల్ 4వ స్థానంలో, రిషబ్ పంత్ 9వ స్థానంలో ఉన్నారు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 415 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహెదీ హసన్ మిరాజ్ 285 పాయింట్లతో రెండో స్థానంలో.. రవిచంద్రన్ అశ్విన్ 283 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నారు.