భారత స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథ్(67) హఠాన్మరణం చెందారు. సాత్విక్ మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారం అందుకోనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమలాపురం నుంచి కారులో ఢిల్లీ బయలుదేరారు. అయితే కొద్దిసేపటిలో కారులో కుప్పకూలిపోయారు. హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
- Advertisement -
ఆయన పెద్ద కుమారుడు అమెరికా నుంచి వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన కాశీ విశ్వనాథ్(Kashi vishwanath).. బ్యాడ్మింటన్ ఆటగాడు కావాలనే కలను తన కుమారుడు సాత్విక్ ద్వారా తీర్చుకున్నారు. ఆయన మృతి పట్ల ప్రముఖులతో పాటు తోటి క్రీడాకారులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.
