ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా (Australia VS South Africa) జట్ల మధ్య జరగాల్సిన కీలక పోరు రద్దు అయింది. ఈ మ్యాచ్ వేదికైన రావల్పిండిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో రెండు గంటల పాటు మ్యాచ్‌ను వాయిదా వేశారు. అయితే ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్స్ ప్రకటించారు. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించాయి. అయితే నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో సౌతాఫ్రికా టీమ్ మూడు పాయింట్లతో గ్రూప్ బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇక గ్రూప్ బిలో మిగిలిన జట్లు అయినా ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్‌లు తమ తొలి మ్యాచ్‌లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్ల ఖాతాలో ఒక్క పాయింట్ కూడా లేదు. ఇంగ్లాండ్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్లను ఓడిస్తే నాలుగు పాయింట్లు లభిస్తాయి. అఫ్గానిస్థాన్ కూడా తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాను ఓడిస్తే నాలుగు పాయింట్లను సాధించవచ్చు. అప్పుడు ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది. అలా కాకుండా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మరో మ్యాచ్ గెలిస్తే మాత్రం ఆ రెండు జట్లే సెమీస్‌కు చేరుకుంటాయి.