ఛాంపియన్స్ ట్రోఫీలో(Champions Trophy) భాగంగా న్యూజిలాండ్(New Zealand) జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Bangladesh) నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో బంగ్లా టాపార్డర్ బ్యాటర్లు తడబడ్డారు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (77) మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్స్ జాకెర్ అలీ (45), రిషాద్ హొస్సేన్ (26) ధాటిగా ఆడటంతో బంగ్లాదేశ్ ఆ మాత్రమైన స్కోరు చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్‌వెల్ 4 వికెట్లు తీయగా, విలియం ఓ రూర్క్ 2, కైల్ జేమీసన్, మ్యాట్ హెన్రీ చెరో వికెట్ పడగొట్టారు.
కాగా ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడిపోతే మాత్రం గ్రూప్ ఏ నుంచి పాకిస్థాన్, బంగ్లా సెమీస్ రేసు నుంచి తప్పుకుంటాయి. న్యూజిలాండ్, భారత్ సెమీస్‌కు చేరుతాయి. ఇక మంచి ఫామ్‌లో ఉన్న కివీస్ బ్యాటర్లను బంగ్లా బౌలర్లు ఏమాత్రం కట్టడి చేస్తారో చూడాలి.