Monday, March 10, 2025
HomeఆటChampions Trophy: రికార్డ్ వ్యూస్‌ రాబట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్

Champions Trophy: రికార్డ్ వ్యూస్‌ రాబట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ పలు రికార్డులను సృష్టించింది. వ్యూస్‌ పరంగా అత్యధికమంది చూసిన మ్యాచ్‌గా ఘనత సాధించింది. ఇప్పటివరకు ఐసీసీ ట్రోఫీల ఫైనల్‌ మ్యాచ్‌లకు వచ్చిన వ్యూస్ కంటే దాదాపు 15 రెట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు వ్యూస్ వచ్చాయి. 90 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఏకకాలంలో 6.1 కోట్ల మంది చూసినట్లు తెలుస్తోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ – పాక్ మ్యాచ్‌కు 60 కోట్ల వ్యూస్ వచ్చాయి.

- Advertisement -

ఇదిలా ఉంటే భారత దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అధిగమించారు. ఇప్పటివరకు వీరిద్దరూ నాలుగేసి ఐసీసీ ట్రోఫీలను తమ ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు తొమ్మిది నెలల వ్యవధిలోనే భారత్ రెండు ఐసీసీ ట్రోఫీలను దక్కించకోవం విశేషం. గతేడాది టీ20 ప్రపంచ కప్‌ను రోహిత్ సేన గెలుచుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News