ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో టీమిండియా(Team India) తొలి పోరుకు సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ లో విజయం సాధించి టోర్నీకి మంచి ఆరంభం ఇవ్వాలని రోహిత్ సేన ఆశిస్తోంది. ఇటీవల ఇంగ్లండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్.. అదే ఊపుతో ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగు పెట్టింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు ఇటీవల వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిని చవిచూసింది.
ఈ క్రమంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య హెడ్ టూ హెడ్ రికార్డ్స్ చూస్తే.. ఈ రెండు జట్లు 1988 నుంచి ఇప్పటి వరకు 41 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 32 మ్యాచ్‌లను భారత్ గెలుచుకోగా, బంగ్లాదేశ్ ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌కు ఫలితం రాలేదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-బంగ్లాదేశ్ ఇప్పటి వరకూ ఒకసారి మాత్రమే తలపడ్డాయి.. ఆ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.
భారత్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
బంగ్లాదేశ్ జట్టు: తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్