Sunday, November 16, 2025
HomeఆటIndian Cricket Team: 2026 టీ20 వరల్డ్ కప్ వరకు టీమిండియా షెడ్యూల్ ఇదే..!

Indian Cricket Team: 2026 టీ20 వరల్డ్ కప్ వరకు టీమిండియా షెడ్యూల్ ఇదే..!

- Advertisement -

Asia Cup To Australia Tour: ఇంగ్లాండ్‌తో అద్భుత ప్రదర్శన తర్వాత టీమిండియా కాస్త విరామం తీసుకుని సెప్టెంబరు నుంచి వరుస టోర్నీలు ఆడబోతుంది. అయితే ఆగస్టులో బంగ్లాదేశ్ తో ఆడాల్సి ఉంది, అయితే కొన్ని కారణాల వల్ల అది వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. దీంతో టీమిండియా ఆటగాళ్లకు కాస్త రెస్ట్ దొరికింది. ఈ ఏడాది సెప్టెంబరులో యూఏఈ వేదికగా జరగబోయే ఆసియా కప్ నుంచి.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ వరకు భారత షెడ్యూల్ ఏంటో ఒకసారి చూద్దాం.

షెడ్యూల్ ఇదే..

**సెప్టెంబరు 9- 18 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీలో టీమిండియా 3 నుంచి 7 టీ20 మ్యాచులు ఆడే అవకాశం ఉంది.

**ఆసియా కప్ ముగిసిన తర్వాత భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచులు అక్టోబరు 2 నుంచి 14 వరకు జరుగుతాయి.

**ఆ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది. ఇవి అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు జరుగుతాయి.

**ఈ ఏడాది చివరిలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది.

**భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడనుంది. నవంబర్ 14 నుంచి డిసెంబరు 19 వరకు మ్యాచులు జరుగుతాయి. ఈ టూర్ లో ప్రోటీస్ తో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

**వచ్చే ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ జట్టు భారత్ లో పర్యటించనుంది. జనవరి 11-31 వరకు జరిగే ఈ సిరీస్ లో ఇరుజట్లు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నాయి.

Also Read: Breaking – ఇంగ్లండ్‌పై భారత్ సంచలన విజయం

ఆసియా కప్ లో దాయాదుల పోరు

సెప్టెంబరులో జరగబోయే 2025 ఆసియా కప్‌లో భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఈ రెండు దేశాలు చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీ పడ్డాయి.

Also Read: Ravindra Jadeja- టెస్టుల్లో తెలుగోడి రికార్డును బద్దలు కొట్టిన జడేజా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad