CSK vs LSG IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఛేదించింది. కాగా, ఈ ఓటమితో మొత్తం 8 పరాజయాలతో LSG ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది.
Also Read: https://teluguprabha.net/telangana/pm-modi-suggests-reducing-gold-purchases-for-a-year/
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కి శుభారంభమే దక్కింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ 85(33 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లు) పరుగులతో చెలరేగి ఆడాడు. అయితే ఇంగ్లిస్ ఔటైన తర్వాత లక్నో వరుసగా వికెట్లు కోల్పోగా.. చివర్లో షాబాజ్ అహ్మద్ (25 బంతుల్లో 43 నాటౌట్) రాణించాడు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంబోజ్ 2, నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశారు.
Also Read: https://teluguprabha.net/national-news/vijay-gives-up-trichy-east/
204 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ విజయాన్ని కైవసం చేసుకుంది. సంజూ శాంసన్ 28(14) మెరుపులు మెరిపించగా.. ఉర్విల్ పటేల్ 65(23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 42(28) మంచి సహకారం అందించాడు. చివర్లో శివమ్ దూబే (7 బంతుల్లో 15 నాటౌట్), ప్రశాంత్ వీర్ (12 బంతుల్లో 17 నాటౌట్) జట్టుని విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్, షాబాద్ చెరో 2 వికెట్లు తీశారు. అవేష్ ఖాన్‌కి ఒక వికెట్ దక్కింది. తాజా విజయంతో సీఎస్‌కే ఐదో స్థానంలో ఉంది.

