Tuesday, March 25, 2025
HomeఆటCSK vs MI : బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. తొలి పోరులో ముంబై...

CSK vs MI : బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. తొలి పోరులో ముంబై ఓటమి..!

చెన్నై వేదికగా జరిగిన తొలి పోరులో.. ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. రాహుల్ త్రిపాఠి 2, శివమ్ దూబే, 9, దీపక్ హుడా 3, శామ్ కర్నన్ 4, విఫలమైనా. కెప్టెన్ రుతురాజ్ 53 పరుగులు, రచిన్ రవీంద్ర 65 పరుగులు, జడేజా 17 పరుగులు చేయడంతో ఆ జట్టు విక్టరీ సాధించింది. ముంబై బౌలర్లలో విఘ్నేష్ పుతుర్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు.

- Advertisement -

అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు ఆరంభంలోనే భారీ దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ (0) డకౌట్ అయ్యాడు. దూకుడుగా ఆడిన రికెల్టన్ (13), విల్ జాక్స్ (11)లు వెంట వెంటనే అవుటయ్యారు. దాంతో ముంబై కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో జతకలిసిన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు 4వ వికెట్ కు 51 పరుగులో జోడించారు.

అయితే ధోని అద్భుత స్టంపింగ్ కు సూర్యకుమార్ యాదవ్ (29) అవుటయ్యాడు. ఆ వెంటనే రూబెన్ మింజ్ (3), తిలక్ వర్మలు(31) అవుటయ్యారు. కాసేపటికే నమన్ దీర్ (14) కూడా అవుటయ్యాడు ఈ 4 వికెట్లు కూడా నూర్ అహ్మద్ కే దక్కాయి. చివర్లో దీపక్ చహర్ ధాటిగా ఆడటంతో ముంబై ఇండియన్స్ ఆ మాత్రం స్కోరును సాధించగలిగింది. దీంతో ముంబై 155 పరుగులకు పరిమితం అయ్యింది. చెన్నై బౌలర్లులో నూర్ అహ్మద్ 4 వికెట్లతో మెరిశాడు. ఖలీల్ అహ్మద్ కు 3 వికెట్లు దక్కాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News