చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో రంగారెడ్డి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య విచ్చేశారు. దామరగిద్ద గ్రామ సర్పంచ్ వెంకటేశం గుప్తా అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. క్రీడలు మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తాయన్నారు. ఆట… అనేది ప్లేయర్స్ ప్రేక్షకులలో ఏ రంగంలో నైనా తాము గెలవాలి అనే ప్రేరణ కలిగిస్తుందన్నారు. గ్రౌండ్లో ఆట మొదలు కొని చివరి వరకు ప్లేయర్స్ ప్రేక్షకుల మధ్య ఒక విధమైన ఉత్కంఠ నెలకుంటుందన్నారు. ఏ ఆట అయిన గ్రౌండ్ లో గెలుపు ఓటమి కాదన్నారు. ఆట వల్ల మనుషులు కలిగే ప్రేరణ సమాజంలో ఒడి దుడుకులను ఎదుర్కొంటూ…సమాజంలో మనిషిని ముందుకు నడిపిస్తుందన్నారు. ధ్రుడ సంకల్పం పట్టుదల నిరంతర కృషి ఉంటే సాధించలేనిది లేదన్నారు. మనిషికి ఎదురయ్యే ఓటమి కూడా గెలుపుకు తొలిమెట్టు అన్నారు. సమాజంలో ప్రతి పౌరుడు గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలన్నారు. గ్రామ అభివృద్ధికి దామరగిద్ద బస్టేపూర్ మధ్య వాగుపై కల్వర్ట్ నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేశామన్నారు. గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి నాలుగు లక్షలు మంజూరు చేశామన్నారు. సర్పంచ్ వెంకటేశం గుప్త మాట్లాడుతూ…దామరిగిద్ద గ్రామంలో గత 30 సంవత్సరాలుగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఆటలు ఐక్యతకు నిదర్శనం అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో రంగారెడ్డి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ జిల్లా స్థాయి టోర్నమెంట్లో దామరిగిద్ద గ్రామ యువకులు పార్టిసిపేట్ చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా గ్రామ సర్పంచిగా యువతకు తోడ్పాటు అందిస్తున్నామన్నారు. ఐక్యమత్యమే మహా బలమని! పరస్పరం తోడ్పాటు అందిస్తూ…. గ్రామ అభివృద్ధిలో యువత కలిసి ముందుకు సాగడం గర్వకారణం అన్నారు. గ్రామానికి ఎలాంటి నిధులు అవసరమైనా ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారం అందించడం సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి వెంకటేశ్వర్ రెడ్డి జడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి మండల అధ్యక్షుడు పెద్దొల్ల ప్రభాకర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గని యూత్ మండల అధ్యక్షుడు శేఖర్ టోర్నమెంట్ నిర్వాహకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.