షాబాద్ మండలంలోని పి ఆర్ ఆర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖో-ఖో గేమ్స్ జరిగాయి. ఈ గేమ్స్ లో శంకర్ పల్లి, చేవెళ్ళ, షాబాద్ మూడు మండలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో అండర్ 14 గర్ల్స్ ఖోఖో విభాగంలో చేవెళ్ల మోడల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతిని సాధించ్చింది.
స్పోర్ట్స్ నిర్వాహకులు ఈ షిల్డ్ నీ నూతన ప్రిన్సిపాల్ చిన్నపురెడ్డికి విద్యార్థులు అందించారు. ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను అభినందించారు. క్రీడలు పిల్లల జీవితాలలో ప్రాధాన పాత్ర పోషిస్తాయన్నారు. క్రీడల వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. పిల్లలకి ప్లేగ్రౌండ్ కు అలవాటు చేయడం ఎంతో మంచిదని పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు స్పోర్ట్స్ ఉపయోగపడతాయని అన్నారు. రంగారెడ్ది జిల్లా స్థాయిలో జరిగే ఖోఖో పోటీలకు స్కూల్ నుండి మీనా, నందిని, స్నేహిత ముగ్గురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని పీడీ ఆంజనేయులు తెలిపారు.