China Masters: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. షెన్ జెన్ లో గురువారం జరిగిన విమెన్స్ ప్రీ క్వార్టర్స్ లో థాయ్‌లాండ్‌కు చెందిన ఆరో సీడ్ పోర్న్‌పావీ చోచువోంగ్‌పై అలవోకగా విజయం సాధించింది. తొలి రౌండ్ లో సింధు 21-15, 21-15 తో పోర్న్ పావీపై గెలుపొందింది. కాగా.. కేవలం 41 నిమిషాల్లోనే సింధూ గేమ్ ని ముగించడం గమనార్హం. ఈ విజయంతో 14వ ర్యాంక్‌లో ఉన్న సింధు.. చోచువాంగ్‌తో జరిగిన తన హెడ్-టు-హెడ్ రికార్డును 6-5కి మెరుగుపరుచుకుంది. ఈ స్టార్ భారత క్రీడాకారిణి క్వార్టర్ ఫైనల్స్‌లో అన్ సే యంగ్‌తో తలపడనుంది. ఈ టాప్-సీడ్ కొరియా ప్లేయర్ సింధూతో ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ ఆమెను ఓడించింది. వాటిలో ఆరు వరుస గేమ్‌లలో ముగిశాయి. ఇటీవల ముగిసిన హాంకాంగ్ ఓపెన్‌లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించిన సింధు.. ఈ టోర్నమెంట్ లో వరుస గేమ్‌ల విజయంతో ఆనందంగా ఉంది.
Read Also: Samantha Interview: నటిగానే ఉండిపోను.. ఆ సమస్యతో పోలిస్తే అన్నీ చిన్నవే సమంత
క్వార్టర్స్ లోకి సాత్విక్- చిరాగ్ జోడీ
అంతేకాకుండా, భారత ధ్వయం సాత్విక్-చిరాగ్ కూడా క్వార్టర్స్ లోకి దూసుకెళ్లారు. సాత్విక్-చిరాగ్ జోడీ 33 నిమిషాల్లో మ్యాచ్ ని ముగించారు. చైనీస్ తైపీకి చెందిన వాంగ్ చి-లిన్- చియు హ్సియాంగ్-చిహ్‌లను 21-13, 21-12 తేడాతో ఓడించారు. కాగా.. క్వార్టర్స్ లో చైనీస్ జోడీ రెన్ జియాంగ్ యు- క్సీ హవోనన్‌లతో పోరుకు సిద్ధమైంది.
Read Also: PM Modi 75th birthday: మోదీకి శుభాకాంక్షల వెల్లువ.. పోప్ లియో ప్రత్యేక ఆశీస్సులు


