Saturday, November 15, 2025
HomeఆటKarnataka: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

Karnataka: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

Bangalore: 2025 ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ జట్టు తొలి టైటిల్ గెలిచిన సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ వేడుకలు తీవ్ర విషాదంలో ముగిశాయి. లక్షలాది మంది ఆర్సీబీ అభిమానులు ఒకే స్థలంలో చేరడంవల్ల తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనా సమయంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన కారణంగా, చిన్నస్వామి స్టేడియం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.

- Advertisement -

ఈ విషాదం నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు స్టేడియంపై సురక్షితత పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. భవిష్యత్తులో ఇక్కడ జరిగే కార్యక్రమాలపై పునఃసమీక్షను చేపట్టింది. ఈ మేరకు, కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన జస్టిస్ జాన్ మైఖేల్ డీ’కున్హా కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Readmore: https://teluguprabha.net/sports-news/why-cricketers-wear-white-in-tests/

చిన్నస్వామి స్టేడియంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, సముదాయాలు, సురక్షిత చర్యల పట్ల జస్టిస్ డీ’కున్హా కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. స్టేడియం సామర్థ్యం కేవలం 30,000 మంది కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సందర్భంగా 3 లక్షల మంది అభిమానులు చేరడంతో అక్కడి పరిస్థితులు అదుపుతప్పాయి.

చిన్నస్వామి స్టేడియం డిజైన్ మరియు నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఫుట్‌పాత్‌కి తెరుచుకోవడం వల్ల తొక్కిసలాట జరిగే అవకాశానికి కారణమైంది. అభిమానులు నిలబడేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో వారు రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై నిలబడాల్సి వచ్చి, పరిస్థితి అదుపు తప్పింది. ఖాళీ చేయడానికి ఎలాంటి సరైన ప్రణాళికలు లేకపోవడంతో ఈ ఘటన మరింత విషాదానికి దారితీయడం జరిగింది.

Readmore: https://teluguprabha.net/sports-news/india-batters-create-record-with-500-plus-runs-in-single-test-series/

ఈ నివేదిక తర్వాత, చిన్నస్వామి స్టేడియంలో భవిష్యత్తులో జరిగే పెద్ద టోర్నమెంట్లు పట్ల తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. 2025 సంవత్సరంలో జరగనున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్, 2026 ఐపీఎల్ సీజన్ మ్యాచ్‌లు వేరే వేదికలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే మహారాజా టీ20 టోర్నమెంట్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించింది.

జస్టిస్ డీ’కున్హా కమిషన్, ఈ ఘటనకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్లు, కేఎస్‌సీఏ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంది. ఈ దర్యాప్తు నివేదిక ఆధారంగా, కర్ణాటక ప్రభుత్వం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
చిన్నస్వామి స్టేడియం సురక్షిత ప్రమాణాలు మెరుగుపరచకపోతే, భవిష్యత్తులో  ప్రధాన క్రికెట్ వేదికగా ఉండటం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad