Sunday, July 7, 2024
HomeఆటFIFA World cup : బెల్జియం ఓటమితో చెలరేగిన అల్లర్లు..పోలీస్ స్టేషన్ ధ్వంసం

FIFA World cup : బెల్జియం ఓటమితో చెలరేగిన అల్లర్లు..పోలీస్ స్టేషన్ ధ్వంసం

ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో మొరాకోతో జరిగిన మ్యాచ్ లో బెల్జియం 0-2తో ఓటమి పాలైంది. దాంతో ఆ దేశ రాజధాని బ్రసెల్స్ లో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. బెల్జియంలో దాదాపు 5 లక్షల మంది మొరాకో వాసులు ఉంటున్నారు. మొరాకో చేతిలో బెల్జియం ఓటమితో.. మొరాకో వాసులంతా వీధుల్లోకి వచ్చి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటన బ్రసెల్స్ లోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లకు కారణమైంది.

- Advertisement -

కొందరు ఆందోళనకారులు దుకాణాలను పగలగొట్టి.. వాహనాలను తగలబెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లర్లకు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశారు. కాగా.. ఫిఫా మ్యాచ్ ముగిసేందుకు ముందే కొందరు అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్లపై బాణసంచా కాల్చడంతో ఒక జర్నలిస్టు గాయపడినట్లు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో భారీగా మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా మెట్రో స్టేషన్లను మూసివేశారు. బెల్జియం తూర్పు నగరమైన లీగ్‌లో 50 మందితో కూడిన ముఠా స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసింది. అద్దాలను బద్దలుకొట్టి.. రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News