Friday, September 20, 2024
HomeఆటCM cup: 6000 మంది ఆటగాళ్లు, 33 జిల్లాలు.. ఘనంగా సీఎం కప్

CM cup: 6000 మంది ఆటగాళ్లు, 33 జిల్లాలు.. ఘనంగా సీఎం కప్

రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిర్వహించిన సీఎం కప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సూచనల మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించమన్నారు. ఈ క్రీడా పోటీలలో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారుల లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే లక్ష్యంతో దేశానికి సరిపడా క్రీడాకారులను అందించేందుకు సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించమన్నారు. ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండీ మండల, జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి ఎంపికైనా క్రీడా పోటీలలో సుమారు 6000 మంది క్రీడాకారులు ఆరు స్టేడియాలలో నిర్వహించిన 18 క్రీడ అంశాలలో, 11 వ్యక్తిగత విభాగంలో ఓవర్ ఆల్ ఛాంపియన్ గా బాలుర విభాగంలో హైదరాబాద్ జిల్లా 89 పతకాలు సాధించి ఛాంపియన్ గా నిలిచింది. రంగారెడ్డి జిల్లా 56 పతకాలు సాధించి రెండో స్థానం సాధించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 41 పతకాలు సాధించి మూడో స్థానం లో నిలిచిన మూడు జిల్లాల కు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ట్రోపీలను బహుకరించారు. బాలికల విభాగంలో రంగారెడ్డి జిల్లా 49 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. హైదరాబాద్ జిల్లా 36 పతకాలు సాధించి రెండవ స్థానంలోనూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 31 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచిన సందర్భంగా రాష్ట్ర మంత్రులు ట్రోపీలను అందజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో SATS OSD డా లక్ష్మీ, ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్, SATS ఉన్నతాధికారులు సుజాత, అనురాధ, మనోహర్, ధనలక్ష్మి, ప్రేమ్ రాజ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News