Saturday, April 12, 2025
HomeఆటCM Revanth appreciated cricketer Siraj: క్రికెటర్ సిరాజ్ కు సీఎం రేవంత్ అభినందనలు

CM Revanth appreciated cricketer Siraj: క్రికెటర్ సిరాజ్ కు సీఎం రేవంత్ అభినందనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్. టి 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ ను అభినందించిన ముఖ్యమంత్రి. టీం ఇండియా జెర్సీని సీఎం రేవంత్ రెడ్డికి బహూకరించిన సిరాజ్.

- Advertisement -

టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్ ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సిరాజ్ను ఘనంగా సన్మానించారు. మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని, అందుకే ఈ రోజు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకడుగా పేరు సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలసిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News