Saturday, November 23, 2024
HomeఆటCM Revanth: క్రీడలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ

CM Revanth: క్రీడలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ

స్పోర్ట్స్ విలేజ్ గా గచ్చిబౌలి..

గచ్చిబౌలి స్టేడియంలో NMDC హైదరాబాద్ మారథాన్ 2024 బహుమతుల ప్రదాననోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్రీడలకు కేరాఫ్ గా తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తామన్న సీఎం, రాష్ట్రంలో క్రీడలు గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలయ్యాయని అన్నారు.

- Advertisement -

క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయిందని సీఎం రేవంత్ ఆరోపించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందన్నారు. తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ వేదికగా మాట ఇస్తున్నట్టు సీఎం వెల్లడించటం విశేషం.

గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతామని, ఒలంపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకడమిక్ ఇయర్ లో ప్రారంభించబోతున్నామన్నారు. అంతర్జాతీయ స్ధాయి కోచ్ లను తీసుకొచ్చి క్రీడలకు శిక్షణ అందిస్తామని, ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపామన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, బాక్సర్ నిఖత్ జరీన్, తదితరులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News