Ind vs SA 2025 Full Schedule: ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నెగ్గిన తర్వాత ఆదే ఊపును తర్వాత సిరీస్ లో కొనసాగించాలని టీమ్ ఇండియా భావిస్తోంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు మరియు ఐదు టీ20లు ఆడేందుకు సిద్దమైంది. ఈ సిరీస్ నవంబర్ 14న ప్రారంభమై.. డిసెంబర్ 19 వరకు కొనసాగుతుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ దక్షిణాఫ్రికా టెస్ట్‌ల కోసం 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మరియు వికెట్ కీపర్ ఎన్ జగదీశన్‌లను తొలగించారు. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్, పేసర్ ఆకాష్ దీప్ తిరిగి జట్టుతో చేరారు.
పూర్తి షెడ్యూల్
టెస్ట్ సిరీస్:
1వ టెస్ట్: నవంబర్ 14–18, కోల్‌కతా
2వ టెస్ట్: నవంబర్ 22–26, గౌహతి
వన్డే సిరీస్:
1వ వన్డే: నవంబర్ 30, రాంచీ
2వ వన్డే: డిసెంబర్ 3, రాయ్‌పూర్
3వ వన్డే: డిసెంబర్ 6, విశాఖపట్నం
T20I సిరీస్:
1వ T20I: డిసెంబర్ 9, కటక్
2వ T20I: డిసెంబర్ 11, న్యూ చండీగఢ్
3వ T20I: డిసెంబర్ 14, ధర్మశాల
4వ T20I: డిసెంబర్ 17, లక్నో
5వ T20I: డిసెంబర్ 19, అహ్మదాబాద్
Also Read: Faruque Ahmed -బంగ్లా మాజీ కెప్టెన్‌కు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు..
సౌతాఫ్రికా సిరీస్ కోసం భారత జట్టు:
శుబ్ మాన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్-కెప్టెన్ & వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ మరియు ఆకాష్‌దీప్.


