Saturday, November 15, 2025
HomeఆటCricket News: డ్రింక్స్ బ్రేక్‌లో క్రికెటర్లు ఏం తాగుతారో మీకు తెలుసా!

Cricket News: డ్రింక్స్ బ్రేక్‌లో క్రికెటర్లు ఏం తాగుతారో మీకు తెలుసా!

Cricket Drinks Break: క్రికెట్‌ ప్లేయర్స్ డ్రింక్స్ బ్రేక్‌లో ఏం తాగుతారు? లంచ్ బ్రేక్‌లో ఏం తింటారు? టీ బ్రేక్‌లో వాస్తవంగా టీ తాగుతారా? అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇలాంటి సింపుల్ ప్రశ్నలకు చాలామందికి సమాధానం తెలియకపోవచ్చు. వాటి గురించి తెలుసుకోవడానికి కొందరు క్రీడా అభిమానులు విపరీతమైన ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కు చెందిన స్టార్ క్రికెటర్ ఓలీ పోప్ తన అనుభవాలు, అలవాట్లను పంచుకున్నాడు.

- Advertisement -

టీమ్ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓలీ పోప్ ఓ అద్భుత సెంచరీ చేసి ఇంగ్లండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘంగా సాగిన ఈ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల ఆరోగ్యం, శక్తి కాపాడుకోవడం చాలా అవసరం. అందుకే ఆట మధ్యలో డ్రింక్స్ బ్రేక్, లంచ్ బ్రేక్, టీ బ్రేక్ పెడుతుంటారు. అయితే ఆ బ్రేక్ సమయాల్లో తమకి ఇష్టమైన క్రికెటర్లు ఏం చేస్తారనే విషయంపై ఇప్పుడు సందిగ్ధం వీడింది. ఇంగ్లాండ్ కు చెందిన బ్యాట్స్‌మన్ ఓలీ పోప్ తాను బ్రేక్ సమయాల్లో ఏమేమి తింటాడో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్ మాట్లాడుతూ.. “నేను సాధారణంగా చేపలు, చికెన్ లేదా పాస్తా తినాలంటే చాలా ఇష్టం. నా శరీరంలో శక్తి రావడానికి ఓ మోతాదులో తింటాను. కానీ, కొన్ని సమయాల్లో పరిస్థితులను బట్టి తీసుకునే ఆహారం మారుతూ ఉంటుంది.  నేను బ్యాటింగ్ చేస్తుంటే చాలా తక్కువ తీసుకుంటాను. ఆ సమయంలో ఎక్కువ తినాలి అనిపించదు. బ్యాటింగ్ చేసే సమయంలో ప్రొటీన్ షేక్, ఒక అరటిపండు తింటాను. ఒకవేళ ఒక రోజంతా బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. రోజు చివర్లో పెద్దగా ఏమీ తినను. శక్తి కోసం కొద్దిగా తింటే చాలు. ఎక్కువ తినకూడదు” అని ఓలీ పోప్ వెల్లడించాడు. అయితే టీ బ్రేక్ సమయంలో నిజంగా టీ తాగుతారా? అనే ప్రశ్నకు ఓలీ పోప్ మాట్లాడుతూ.. కొందరు టీ తాగుతారని సమాధానమిచ్చాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad