ఈనెల 17 నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. “ఒక్క అవకాశం కావాలి (Need a break)” అంటూ ఆ పోస్టులో పేర్కొన్నాడు. దీంతో ఏదో ఒక ఫ్రాంచైజీ షాను జట్టులోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. వారిలో కొంతమంది తిరిగి ఇండియాకు రావడానికి విముఖత చూపుతున్నారు. దీంతో వారి స్థానంలో వేరే ఆటగాళ్లను రీప్లేస్ చేసుకోవాలని ఫ్రాంఛైజీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పృథ్వీషా తనకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ పోస్ట్ పెట్డం చర్చనీయాంశంగా మారింది.
కాగా గతేడాది జరిగిన మెగా వేలంలో పృథ్వీ షాను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఫామ్‌లేమి, ఫిట్‌నెస్, క్రమశిక్షణ లేకపోవడం వంటి కారణాలతో క్రికెట్ కెరీర్‌పై ప్రభావం చూపించాయి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు పృథ్వీను తీసుకుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.