Sarfraz Khan new look: 27 ఏళ్ల సర్ఫరాజ్ నౌషాద్ ఖాన్ ప్రస్తుతం శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఏకంగా రెండు నెలలలో 17 కిలోల బరువు తగ్గాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటన భారత జట్టులో చోటు సంపాదించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడని పలువురు భావిస్తున్నారు. గతంలో 95 కిలోలు ఉన్న భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ 78 కిలోలకు తగ్గారు.
తిరిగి జట్టులో స్థానం సంపాదించలనే లక్ష్యంతో సర్ఫరాజ్ బరువు తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నాడు. ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తూ తన డైట్ ని పూర్తిగా మార్చేశాడు. కేవలం కీర, సలాడ్స్, బ్రోకలీ వంటి కూరగాయలు తీసుకుంటూ.. ప్రోటీన్ కోసం ఫిష్, చికెన్, ఎగ్స్, మొలికెత్తిన విత్తనాలను తీసుకుంటున్నాడు.
ఇలా ఆహార నియమాలను పాటిస్తూ రెండు నెలలలో సర్ఫరాజ్ 17 కిలోల బరువు తగ్గాడు. సామజిక మాధ్యమం ద్వారా సర్ఫరాజ్ తను సన్నబడిన ఫోటోను షేర్ చేయటంతో అతన్ని చూసి అందరూ ఆశర్యపోయారు. భారతీయ జట్టులో చేరాలి అన్న కసితో బరువు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్ ని చూసి పలువురు అభినందిస్తున్నారు.
సర్ఫరాజ్ ఖాన్ బరువు తగ్గి స్లిమ్‌గా మారిన ఫోటోలు కెవిన్ పీటర్సన్ కంట పడటంతో
సర్ఫరాజ్..! నీకు హృదయపూర్వక అభినందనలు. మైదానంలో మరింత మెరుగైన, స్థిరమైన ప్రదర్శనకు ఇది ఖచ్చితంగా దోహదపడుతుందని ఆశిస్తున్నా. మళ్లీ జాతీయ జట్టుకు ఆడాలనే సంకల్పంతో నువ్వు కష్టపడుతున్న తీరు నాకెంతో నచ్చింది. అని కెవిన్ పీటర్సన్ ఎక్స్ లో ట్వీట్ చేసాడు.


