HomeTop StoriesDC vs CSK: సంజూ శాంసన్‌ విధ్వంసం.. ఢిల్లీపై సీఎస్‌కే సూపర్‌ విక్టరీ

DC vs CSK: సంజూ శాంసన్‌ విధ్వంసం.. ఢిల్లీపై సీఎస్‌కే సూపర్‌ విక్టరీ

DC vs CSK IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తడబడ్డాయి. ఈ హోరాహోరీ పోరులో సీఎస్‌కే జట్టు అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ డీసీని చిత్తుగా ఓడించింది. చాలా తక్కువ పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్‌ను కట్టడి చేసిన సీఎస్‌కే.. ఆ లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. సంజూ శాంసన్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో డీసీ బౌలర్లపై విరుచుకుపడి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/bengal-cm-mamata-alleged-results-tampered-by-bjp-conspiracy/

తొలుత టాస్‌ గెలిచిన అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్ ఎంచుకోగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన బౌలింగ్‌కి దిగింది. ఈ క్రమంలో సీఎస్‌కే బౌలర్లు డీసీ బ్యాటర్లను ఆరంభం నుంచే కట్టడి చేయడంలో విజయం సాధించారు. పొదుపైన బౌలింగ్‌తో పాటు వికెట్లను రాబడుతూ సత్తా చాటారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (38), సమీర్‌ రిజ్వి (40) పరుగులు రాబట్టేందుకు యత్నించారు. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (12), పాథుమ్‌ నిస్సాంక (19), అక్షర్‌ పటేల్‌(2) విఫలమయ్యారు. నితీశ్‌ రానా(15), కరుణ్ నాయర్‌(13), అశుతోష్‌ శర్మ(14) పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక చెన్నై బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీయగా, అకీల్‌ హుస్సేన్‌, ముఖేష్‌ చౌదరి, గుర్జన్‌ ప్రీత్‌ సింగ్‌, జెమీ ఓవర్టన్‌కి తలో వికెట్‌ దక్కింది. 

Also Read: https://teluguprabha.net/national-news/america-president-trump-congratulates-pm-modi-on-bjps-victory-in-bengal/

156 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన సీఎస్‌కే జట్టు ఆ టార్గెట్‌ను సులభంగా దాటేశారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించారు. సంజూ శాంసన్‌ 87(52బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు నాటౌట్‌) పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చివరివరకూ పోరాడి గెలిచాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (6), ఉర్విల్‌ పటేల్‌ (17) పరుగులకే పెవిలియన్‌ చేరి నిరాశపరిచినా.. కార్తిక్‌ శర్మ 41(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) భాగస్వామ్యంతో జట్టును  విజయతీరాలకు చేర్చాడు. డీసీ బౌలర్లలో అక్షర్‌ పటేల్, లుంగీ ఎంగిడి చెరో వికెట్‌ తీశారు. ఇప్పటివరకూ ఇరు జట్లూ తలో 10 మ్యాచ్‌లు ఆడగా తాజా ఫలితంతో.. సీఎస్‌కే 5 విజయాలను నమోదు చేసి ఆరో స్థానంలో ఉండగా.. డీసీ 4 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News