ఐపీఎల్ 2025లో సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఓటముల పరంపరతో సీజన్ అంతా చీకటిమయంగా గడిపింది. అయితే సీజన్ చివరి మ్యాచ్ లో మాత్రం ధోనీ సేన సంచలనం సృష్టించింది. టోర్నీలో టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకంగా 83 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో పాయింట్స్ టేపుల్ పై ఊహించని మార్పుకు చెన్నై కారణమైంది.
గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్ బరిలో నిలిచింది. అయినా ఈ పరాజయంతో టేబుల్ టాపర్లకే కాదు.. ఇతర జట్లకు కూడా కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. ఈ మ్యాచ్ తర్వాత సీఎస్‌కే స్థానం మారకపోయినా… ఇతర జట్ల అభివృద్ధిపై భారీ ప్రభావం చూపింది. 14 మ్యాచుల్లో కేవలం 4 విజయాలతో సీఎస్‌కే చివరి స్థానంలోనే నిలిచింది. కానీ చివరి మ్యాచులో విజయం సాధించి క్వాలిఫయర్, ఎలిమినేటర్ పోటీలను గందరగోళంలోకి నెట్టేసింది.
గుజరాత్ మాత్రం ఈ పరాజయం అనంతరం కూడా 14 మ్యాచుల్లో 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. మిగిలిన మూడు జట్లు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ ఒక్కో మ్యాచ్ మిగిలివుండగా… వీటిపై ఈ ఒక్క గేమ్ ఫలితం పెద్ద ప్రభావం చూపించనుంది. ఇప్పుడు పంజాబ్-ముంబై జట్ల మధ్య ఫైనల్ లీగ్ పోరులో ఎవరు గెలిచినా వారు క్వాలిఫయర్‌కు చేరుకోనున్నారు. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌కు వెళ్తుంది. అదే సమయంలో ఆర్సీబీ లక్నోను ఓడిస్తే.. కోహ్లీ సేన క్వాలిఫయర్-1కు నేరుగా వెళ్లే అవకాశముంది. లక్నో గెలిస్తే మాత్రం గుజరాత్‌కి క్వాలిఫయర్ ఛాన్స్ తిరిగి దక్కుతుంది.
మొత్తానికి చెన్నై చివరి మ్యాచ్‌లో విజయం సాధించినా… అది వారి ప్లేఆఫ్స్ ఆశలపై ప్రభావం చూపలేదు. కానీ లీగ్ టేబుల్ మొత్తం పటాలను కలిచేసింది. మిగిలిన జట్లకు మాత్రం ఇది ఓ అంచనా గందరగోళంగా మారింది. చివరి క్షణం వరకూ ఎవరు ఎక్కడ నిలిచేది స్పష్టత రాని పరిస్థితిని మిగిల్చింది సీఎస్‌కే.