Sunday, April 6, 2025
HomeఆటCSK vs DC: కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. చెన్నై టార్గెట్ ఎంతంటే..?

CSK vs DC: కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. చెన్నై టార్గెట్ ఎంతంటే..?

ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (77; 51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అభిషేక్ పొరెల్ (33; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అక్షర్ పటేల్ (21; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), సమీర్ రిజ్వీ (20; 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) తమ వంతు పాత్ర పోషించారు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (22*; 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడాడు. ఇక చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్‌ 2, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరనా చెరో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. జేక్ ఫ్రేజర్(0)ని ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. అనంతరం కేఎల్ రాహుల్, అభిషేక్ పొరెల్ 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ఆచితూచి ఆడుతూ మధ్యలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. కాగా రెండు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ రెండు గెలవగా.. మూడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని సీఎస్కే పట్టుదలతో ఉండగా.. ఇక ఢిల్లీ అదే ఫామ్ కొనసాగించి హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News