ఒలింపిక్ మెడలిస్ట్, ఖేల్ రత్న అవార్డు గ్రహీత మనూ బాకర్(Manu Bhaker) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఆమె అమ్మమ్మ, మేనమామ కన్నుమూశారు. హర్యానాలోని మహేంద్రగఢ్ సమీపంలో వారిద్దరు ప్రయాణిస్తున్న స్కూటీని వేగంగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మనూ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.