HomeTop StoriesDC vs RR: అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై ఘన విజయం

DC vs RR: అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై ఘన విజయం

DC vs RR IPL 2026: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. ఆర్‌ఆర్‌ టాప్‌ ఆర్డర్‌ విజృంభించినా చివరి ఓవర్లలో డీసీ పటిష్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు స్కోరు 200 దాటకుండా కట్టడి చేసింది. దీంతో రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/royal-challengers-bangalore-beat-punjab-kings-by-23-runs/

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన రాజస్థాన్‌ జట్టు ఓపెనర్లు చెలరేగి ఆడారు. పవర్‌ ప్లేలోనే భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టారు. యశస్వి జైస్వాల్‌(12) విఫలమైనా.. వైభవ్‌ సూర్యవంశీ 46(21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌ కనబరిచాడు, ధ్రువ్‌ జురెల్‌ 53(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ 51(26 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలతో మంచి భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఇన్నింగ్స్‌ దూకుడుగా కొనసాగుతుండగా వరుసగా వికెట్లు పడుతుండటంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టాడు. లుంగి ఎంగిడి, మాధవ్ తివారీ చెరో రెండు వికెట్లు తీయడంతో పాటు పొదుపైన బౌలింగ్‌తో పరుగుల కట్టడి చేశారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ysrcp-to-protest-tomorrow-against-petrol-and-diesel-price-hike/

194 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఆరంభం నుంచే నిలకడగా ఆడుతూ టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్‌ పోరెల్‌ 51(31 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), కేఎల్‌ రాహుల్‌  56 (42 ఒక ఫోర్, 3 సిక్సర్లు)హాఫ్‌ సెంచరీలతో రాణించి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరు ఔట్‌ అయ్యాక డేవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, సహిల్‌ పరాఖ్‌ నిరాశపరిచారు. దీంతో జట్టు గెలుపు కష్టతరంగా మారింది. అయితే ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకున్న కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ 34(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అశుతోష్‌ 18(5 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) డెత్‌ ఓవర్లలో కీలక ఇన్నింగ్స్ ఆడి అజేయంగా నిలవడంతో పాటు జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఇక రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, బ్రిజేశ్‌ శర్మ చెరో 2 వికెట్లు తీశారు. శనకకి ఒక వికెట్‌ దక్కింది. కానీ, తాజా మ్యాచ్‌ ఫలితంతో ఇరు జట్లకీ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News