HomeTop StoriesRR vs DC IPL 2026: కేఎల్‌ రాహుల్‌, నిస్సాంక విధ్వంసం.. రాజస్థాన్‌పై ఢిల్లీ ఘన...

RR vs DC IPL 2026: కేఎల్‌ రాహుల్‌, నిస్సాంక విధ్వంసం.. రాజస్థాన్‌పై ఢిల్లీ ఘన విజయం

RR vs DC: ఐపీఎల్‌ 2026లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆర్‌ఆర్‌ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలకడగా ఆడుతూ ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌, నిస్సాంక హాఫ్‌ సెంచరీల విధ్వంసంతో ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని సాధించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/repolling-to-take-place-tomorrow-in-15-centres-in-west-bengal/

రాజస్థాన్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా తొలుత టాస్‌ గెలిచిన ఆర్‌ఆర్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌(6), వైభవ్‌ సూర్యవంశీ(4) పవర్‌ ప్లేలోనే నిరాశపరిచి పెవిలియన్‌ చేరినా.. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ 90(50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు), ధ్రువ్‌ జురెల్‌ 42(30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌)అద్భతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. దొనోవన్‌ ఫెరేరా(47) పరుగులతో రాణించాడు. రవీంద్ర జడేజా(20) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టాడు. జెమీసన్‌, అక్షర్‌ పటేల్‌, నటరాజన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Also Read: https://teluguprabha.net/gallery/bellamkonda-sai-sreenivas-and-kavyas-wedding-in-tirumala/

225 పరుగుల భారీ టార్గెట్‌ ఛేదనకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరంభం నుంచే నిలకడగా ఆడుతూ ఘన విజయం సాధించింది. ఓపెనర్లు పాథుమ్‌ నిస్సాంక 62(33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ 75(40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు సాధించి బౌండరీలు, భారీ సిక్సర్లతో చెలరేగి ఆడారు. నితీశ్‌ రాణా 33(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో మంచి తోడ్పాటు అందించాడు. ట్రిస్టన్ స్టబ్స్‌(18), అశుతోష్‌ శర్మ(25) నాటౌట్‌గా నిలిచి జట్టుని విజయ తీరాలకు చేర్చారు. ఆర్‌ఆర్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజాలకు తలో వికెట్‌ దక్కింది. తాజా మ్యాచ్‌ ఫలితంతో రాజస్థాన్‌ రాయల్స్‌ 6(10 మ్యాచులు) విజయాలతో నాలుగో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 4(9 మ్యాచులు) విజయాలతో ఆరో స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News