Wednesday, March 26, 2025
HomeఆటKL Rahul: కేఎల్ రాహుల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ స్పెషల్ విషెస్

KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ స్పెషల్ విషెస్

టీమిండియా క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌(KL Rahul), బాలీవుడ్ నటి అతియా శెట్టి జంట పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాహుల్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అభిమానులు, సెలబ్రెటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తమ సహచర ఆటగాడికి ప్రత్యేక విషెస్ చెప్పింది. జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్, మిచెల్ స్టార్క్, మెంటర్ కెవిన్ పీటర్సన్‌తో సహా ఆటగాళ్లు అందరూ డ్రెస్సింగ్ రూమ్‌లో బేబీ-స్వేయింగ్ సంజ్ఞతో విష్ చేశారు. కాగా రాహుల్, అతియాలు 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సతీమణి ప్రసవం నేపథ్యంలో లక్నో మ్యాచ్‌కు రాహుల్ దూరమయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ జట్టు రూ.12 కోట్లకు రాహుల్‌ని కొనుగోలు చేసింది.

- Advertisement -

ఇదిలా ఉంటే సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ లక్నో టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ సమయంలో ఓటమి ఖాయం అనుకున్న దశ నుంచి అశుతోష్‌ శర్మ (66 నాటౌట్‌; 31 బంతుల్లో 5×4, 5×6), విప్రాజ్‌ నిగమ్‌ (39; 15 బంతుల్లో 5×4, 2×6), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (34; 22 బంతుల్లో 1×4, 3×6) మెరుపులతో ఢిల్లీ అనూహ్య విజయాన్ని అందుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News