ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమిని మరిచిపోతూ.. లక్నో సూపర్ జెయింట్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయం ప్లేఆఫ్స్ ఆశలు మరింత మెరుగు పరుచుకుంది. జట్టు ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శన ఈ అందుకుంది. విజయవాడ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు ఆరంభంలో మెరుగ్గా ఆడినప్పటికీ, మిడిల్ ఓవర్లలో తడబడింది.
ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఏడెన్ మార్క్రమ్ కలసి తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. కానీ, మార్క్రమ్ ఔట్ అయిన వెంటనే లక్నో బ్యాటింగ్ క్రమం కుదేలైంది. పూరన్, సమద్, మార్ష్ తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో భారీ స్కోరు ఆశలు ఆవిరయ్యాయి. అయుష్ బదోనీ 36 పరుగులు చేసినా అది పెద్దగా ప్రభావం చూపలేదు. చివరికి 20 ఓవర్లలో లక్నో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లతో మెరిశాడు. స్టార్క్, దుష్మంత తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యం ఛేదించిన ఢిల్లీ సత్తా చాటింది. 160 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో ఓపెనర్లు కీలక పాత్ర పోషించారు. అభిషేక్ పొరెల్ అర్ధశతకంతో ఆకట్టుకోగా, కేఎల్ రాహుల్ 57 పరుగులతో తన క్లాస్‌ను మరోసారి చాటాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా 34 పరుగులతో జట్టుకు గట్టి మద్దతుగా నిలిచాడు. ఢిల్లీ జట్టు 18వ ఓవర్లోనే టార్గెట్ చేరుకుంది. ఇంకా 13 బంతులు మిగిలుండగానే విజయం తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయం ఢిల్లీ క్యాపిటల్స్‌కు పాయింట్ల పట్టికలో తన స్థానం మెరుగు పరుచుకుంది. ఇక ప్లేఆఫ్స్ చేరాలంటే ఇదే తరహాలో మిగతా మ్యాచ్ ల్లోనూ నిలకడగా ఆడాలి.. కేఎల్ రాహుల్ ఫామ్, ముఖేష్ కుమార్ బౌలింగ్ జట్టుకు పెద్ద బలంగా మారుతున్నాయి.