HomeఆటVinesh Phogat: వినేశ్‌ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. రెజ్లింగ్‌ సమాఖ్యపై ఆగ్రహం వ్యక్తం

Vinesh Phogat: వినేశ్‌ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. రెజ్లింగ్‌ సమాఖ్యపై ఆగ్రహం వ్యక్తం

Vinesh Phogat Delhi HC: స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న 2026 ఏషియన్‌ గేమ్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భారత రెజ్లింగ్‌ సమాఖ్య(WFI) విధించిన ఆంక్షలను తోసిపుచ్చుతూ.. ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో WFI వ్యవహరిస్తున్న తీరును న్యాయస్థానం తప్పుబట్టింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/supreme-court-says-kidnapping-fir-mandatory-in-missing-child-cases/

ఆసియా క్రీడల కోసం భారత రెజ్లింగ్‌ సమాఖ్య నిర్దేశించిన ఎంపిక విధానం వివక్షపూరితంగా ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. మెటర్నిటీ లీవ్‌ తర్వాత రీ- ఎంట్రీ ఇస్తున్న వినేశ్‌ ఫొగాట్ లాంటి దిగ్గజ క్రీడాకారిణులను పరిగణనలోకి తీసుకునే అధికారం సమాఖ్యకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల వినేశ్‌కి జారీ చేసిన ధిక్కారపూరిత షోకాజ్ నోటీసును దురుద్దేశపూరితమైనదిగా కోర్టు కొట్టిపారేసింది. 

Also Read: http://teluguprabha.net/telangana/new-express-train-between-cherlapalli-tirupati/

కాగా, పారదర్శకత కోసం ఎంపిక ట్రయల్స్‌ను వీడియో రికార్డు చేయాలన్న న్యాయస్థానం.. SAI, IOA నుంచి ఇద్దరు స్వతంత్ర పరిశీలకులు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయం ద్వారా వినేశ్‌ ఫొగాట్ తన సస్పెన్షన్‌ను అధిగమించి మళ్లీ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటేందుకు మార్గం సుగమమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News