Delhi blast effect on IND VS SA Series: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ప్రభావం భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ పై కూడా పడింది. సోమవారం దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో కారు బాంబ్ పేలుడు సంభవించి 9 మంది మరణించగా.. 24 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. మంగళవారం నుండి ఈడెన్ గార్డెన్స్‌లో రెండు జట్లు తమ శిక్షణా సెషన్‌లను ప్రారంభించనున్నాయి. తాజా బాంబ్ పేలుడు నేపథ్యంలో తొలి టెస్ట్‌కు ముందు కోల్‌కతా అంతటా భద్రతను పెంచారు. అంతేకాకుండా టీమ్ ఇండియా ఫ్లేయర్లతోపాటు సౌతాఫ్రికా ఆటగాళ్లకు భద్రతను కట్టుదిట్టం చేశారు.
మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నాయి. దీంతో ఆటగాళ్లు బస చేసే హోటల్స్ వద్ద, ప్రాక్టీష్ సెషన్స్ వద్ద, స్టేడియం చుట్టుపక్కల భద్రతను అధికారులు పెంచారు. అంతేకాకుండా ఎక్కడక్కడ చెక్‌పోస్టులు మరియు నిఘా పెట్టారు. మ్యాచ్ నేపథ్యంలో నగరం మెుత్తం నిఘా నీడలో ఉంది. ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్ కోసం వచ్చే ఆటగాళ్ళు, అధికారులు మరియు అభిమానులు సురక్షితంగా ఉండేలా చూసేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) పోలీసులతో సమన్వయం చేస్తోంది. దీనికి సంబంధించిన మీటింగ్ సోమవారం రాత్రి జరిగింది. పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ మంగళవారం స్టేడియంను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
Also Read: Red Fort Blast :- ఎర్రకోట వద్ద రక్తపుటేర్లు.. “మా కళ్ల ముందే మనుషులు
ప్రధాన నగరాల్లో పెరిగిన భద్రత..
ఢిల్లీ బాంబ్ పేలుడు తర్వాత ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్ మరియు చండీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో భద్రతను పెంచారు. పోలింగ్ జరుగుతున్న యూపీ, పంజాబ్, బీహార్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్ ఫోర్టులు, మెట్రో స్టేషన్ల వద్ద భద్రతా తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.


