Tuesday, April 15, 2025
HomeఆటIPL 2025: లఖ్‌నవూ జోరుకు చెన్నై బ్రేక్.. 5 వికెట్ల తేడాతో గెలుపు..!

IPL 2025: లఖ్‌నవూ జోరుకు చెన్నై బ్రేక్.. 5 వికెట్ల తేడాతో గెలుపు..!

ఐపీఎల్ 2025లో వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలు దూరం చేసుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్.. మళ్లీ గెలుపు రుచి చూసింది. CSK కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన క్లాస్‌ చూపిస్తూ అద్భుత ఫినిష్ అందించగా.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై చెన్నై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

- Advertisement -

లక్నో ఎకానా స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచే చెన్నై బౌలర్ల దెబ్బలతో లక్నో ఇబ్బందులకు గురైంది. మార్‌క్రమ్ (6), నికోలస్ పూరన్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా, కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం నిలకడగా ఆడాడు. 49 బంతుల్లో 63 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. మిచెల్ మార్ష్ (30), బదోనీ (22), అబ్దుల్ సమద్ (20) తమవంతు పాత్ర పోషించారు. చెన్నై బౌలింగ్‌లో జడేజా, పతిరన చెరో రెండు వికెట్లు తీసి మెరిశారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ ఒకో వికెట్ తీశారు. బౌలింగ్ యూనిట్ మొత్తం లక్ష్యాన్ని అదుపులో ఉంచేందుకు మంచి ప్రదర్శన కనబరిచింది.

167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఓపెనర్లు రచిన్ రవీంద్ర (37), షేక్ రషీద్ (27) శుభారంభాన్ని అందించారు. కానీ మిడ్ ఇన్నింగ్స్‌లో వికెట్లు వరుసగా కోల్పోయిన చెన్నై ఓ దశలో ఒత్తిడికి గురైంది. విజయ్ శంకర్, జడేజా, రాహుల్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే చివరి ఓవర్లలో ధోనీ, శివమ్ దూబే జోడీ మరింత ఆత్మవిశ్వాసంతో ఆడి మ్యాచ్‌ను చెన్నైవైపునకు తిప్పారు. దూబే 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచినప్పటికీ, అసలైన హీరోగా ధోనీనే నిలిచాడు. కేవలం 11 బంతుల్లో 26 పరుగులు చేశాడు. నాలుగు బౌండరీలు, ఒక సిక్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు.
ఈ విజయం చెన్నైకి ఎంతో కీలకం కాగా.. ధోనీ ఫినిషింగ్ స్కిల్ల్స్‌పై మళ్లీ చర్చ మొదలయ్యేలా చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News