FIDE Women’s World Cup 2025 Title Winner: ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ విజేతగా యువ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. ఫైనల్లో తెలుగు తేజం, సీనియర్ చెస్ క్రీడాకారిణి అయిన కోనేరు హంపిని ఈ టీనేజ్ చెస్ ఫ్లేయర్ ఓడించింది. జార్జియాలోని బటుమిలో జరిగిన తుది పోరులో హంపిని 2.5-1.5 ఓడించడం ద్వారా మహిళల చెస్ ప్రపంచకప్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా 19 ఏళ్ల దివ్య నిలిచింది.
ఫైనల్లో తొలి రెండు గేమ్స్ డ్రాగా ముగియగా.. సోమవారం నిర్వహించిన టై బ్రేకర్ లో దివ్య విజయం సాధించింది. దీంతో దివ్య భారత 88వ గ్రాండ్ మాస్టర్ గా నిలవడమే కాకుండా. క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు అర్హత సాధించింది. రెండుసార్లు ప్రపంచ రాపిడ్ ఛాంపియన్, వరల్డ్ చెస్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో హంపీని ఓడించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. మెదటి గేమ్ లో తెల్లపావులతో ఆడి మ్యాచ్ డ్రా చేసుకున్న దివ్య.. రెండో గేమ్ లో నల్లపావులతో ఆడి విజయాన్ని నమోదు చేసింది. దివ్య ఫైనల్‌కు ముందు సెమీఫైనల్‌లో చైనా మాజీ ప్రపంచ ఛాంపియన్ టాన్ ఝోంగీని ఓడించింది.
దివ్య గత సంవత్సరం ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. అంతకుముందు బుడాపెస్ట్‌లో జరిగిన 2024 చెస్ ఒలింపియాడ్‌లో భారతదేశం బంగారు పతకం సాధించడంలో దివ్య కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత స్వర్ణాన్ని కూడా సాధించింది. దివ్య కంటే ముందు హంపీ, ఆర్. వైశాలి మరియు హరికా ద్రోణవల్లి గ్రాండ్ మాస్టర్ హోదాను పొందారు. నాగ్ పూర్ కు చెందిన దివ్య డిసెంబర్ 9, 2005న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జితేంద్ర దేశ్ ముఖ్, నమ్రతా దేశ్ ముఖ్ వృత్తిరీత్యా వైద్యులు.
Also Read: Stokes vs Jadeja – షేక్ హ్యాండ్ ఇవ్వని జడేజా.. కోపంతో ఊగిపోయిన స్టోక్స్.. వైరల్ గా వీడియో..


