Bangalore: భారత దేశంలో ప్రథమ శ్రేణి క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో ఒకటైన దులీప్ ట్రోఫీ 2025 సంచికకు రంగం సిద్ధమవుతోంది. దులీప్ ట్రోఫీ 2025 ఆగస్టు 28, 2025న ప్రారంభమై, అన్ని మ్యాచులు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ లో నిర్వహించబడతాయి.
దులీప్ ట్రోఫీ జోన్‌ల మధ్య జరిగే రెడ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్. భారత జాతీయ జట్టుకు అర్హత సాధించడానికి ప్లేయర్లకు ఇది గొప్ప వేదికగా నిలుస్తుంది. ఇందులో నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ 5 జట్లుగా పాల్గొంటాయి.
Read more: https://teluguprabha.net/sports-news/mohammed-siraj-ran-31-km-england-test-series/
దులీప్ ట్రోఫీ 2025 లో నార్త్ జోన్ కి కెప్టెన్ గా శుభ్ మన్ గిల్, ఈస్ట్ జోన్ కెప్టెన్ గా ఇషాన్ కిషన్, సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ, వెస్ట్ జోన్ కెప్టెన్ గా శార్దూల్ ఠాకూర్, సెంట్రల్ జోన్ కెప్టెన్ గా ధృవ్ జురెల్ లని బీసీసీఐ నియమించింది. ఆసియా కప్ కి ఎవరైనా ఎంపిక అయితే కెప్టెన్ లు మారే అవకాశం ఉంటుంది.
దులీప్ ట్రోఫీ ప్రారంభమైనప్పటి నుండి అత్యధికంగా వెస్ట్ జోన్ 19 సార్లు టైటిల్ సాధించింది. నార్త్ జోన్ 18 సార్లు టైటిల్ గెలుపొందింది. సౌత్ జోన్ 14, సెంట్రల్ జోన్ 6, అత్యల్పంగా ఈస్ట్ జోన్ 2 సార్లు టైటిల్ సాధించారు. దులీప్ ట్రోఫీ 1961-1962 లో నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నారు.
Read more: https://teluguprabha.net/sports-news/andhra-premier-league-2025-first-day-celebrations/
2023 సంవత్సరం ప్రకారం విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ.కోటి నగదును, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.50 లక్షల నగదును అందిస్తారు.


