Duleep Trophy: దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ నిలిచింది. ఫైనల్‌లో సౌత్ జోన్‌ను చిత్తు చేసి ఈ ట్రోనీఫిని కైవసం చేసుకుంది. సౌత్‌జోన్ నిర్దేశించిన 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. రజత్ పటీదార్ నాయకత్వంలో వరుసగా రెండో టైటిల్‌ను నెగ్గినట్లు అయింది. తొలుత బౌలింగ్ ఎంచుకున్న సెంట్రల్ జోన్ అందుకు తగినట్టుగానే సౌత్ జోన్‌ను కట్టడి చేసింది. బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (31) టాప్ స్కోరర్. సారాన్ష్ జైన్ 5, కుమార్ కార్తికేయ 4 వికెట్లు తీశారు. అనంతరం సెంట్రల్ జోన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ (194) భారీ శతకంతోపాటు కెప్టెన్ రజత్ (101) సెంచరీ బాదాడు. సారాన్ష్ జైన్ (69), డానిష్ మాలెవార్ (53) విలువైన అర్ధశతకాలు చేశారు. అంకిత్ శర్మ 4, గుర్జప్‌నీత్ సింగ్ 4.. నిదీశ్, కౌషిక్ చెరో వికెట్ తీశారు.
Read Also: Puja Khedkar: మరో వివాదంలో పూజా ఖేడ్కర్.. కిడ్నాప్ కేసు నమోదు
రెండో ఇన్నింగ్స్ లో దూకుడు పెంచిన సౌత్ జోన్
తొలి ఇన్నింగ్స్‌లో 362 పరుగులు వెనకబడిన సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దూకుడు పెంచింది. అంకిత్ శర్మ (99), ఆండ్రూ సిద్దార్థ్ (84), స్మరన్ రవిచంద్రన్ (67) హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో 426 పరుగులు చేయగలిగింది. చివరికి సెంట్రల్ జోన్ ముంగిట కేవలం 65 పరుగులనే టార్గెట్ ఉంచింది. కాగా.. ఆ టార్గెట్ ని సెంట్రల్ జోన్ అలవోకగా ఛేదించింది. ఇకపోతే, రజత్ పటీదార్ కెప్టెన్ గా రెండు టైటిల్స్ సాధించినట్లైంది. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ గెలవగా.. ఇంతకుముందు ఐపీఎల్ 18వ ఎడిషన్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకున్నాడు. ఎట్టకేలకో ఈఏడాది ఐపీఎల్ లో బెంగళూరు టైటిల్ విజేతగా గెలిచింది. కాగా.. ఆ జట్టుకు సారథ్యం వహించిన క్రికెటర్ రజత్ పటీదార్.
Read Also: Abhishek Sharma: దాయాదిపై యువ క్రికెటర్ సంచలనం.. విరాట్ ను వెనక్కి నెట్టి..


