Saturday, November 15, 2025
HomeఆటDuleep Trophy 2025: ఈసారి ప్రత్యేకంగా దులీప్ ట్రోఫీ.. బరిలో స్టార్లు..!

Duleep Trophy 2025: ఈసారి ప్రత్యేకంగా దులీప్ ట్రోఫీ.. బరిలో స్టార్లు..!

Duleep Trophy 2025: ఈ సారి రంజీ ట్రోఫీ ప్రత్యేకంగా నిలవనుంది. దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ ప్రాధాన్యత ఇస్తుంది. ఈసారి దులీప్‌ ట్రోఫీని బీసీసీఐ ప్రత్యేకంగా మార్చింది. ఈ టోర్నమెంట్ లో టీమిండియాలోని స్టార్‌ క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. ఇంతకీ ఎవరెవరు ఆడుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

- Advertisement -

ఇంట్రెస్టింగ్ గా దేశవాళీ క్రికెట్

దేశీవాళీ క్రికెట్ లో ఆటగాళ్లు రాణించి జాతీయ జట్టుకు ఎంపిక కావాలని చూస్తారు. కానీ, అభిమానులు మాత్రం ఈ మ్యాచులపై పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అంతా దేశవాళీ ప్లేయర్లే ఉంటారనేది వారి వాదన. అయితే, ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.  ఆసియా కప్‌ కోసం గురువారం ఉదయమే భారత స్క్వాడ్‌ దుబాయ్‌కు వెళ్లనుంది. అక్కడికి 15 మంది మాత్రమే వెళ్తారు. స్టాండ్‌బై ఆటగాళ్లు మాత్రం వెళ్లడం లేదు. దీంతో, మిగతా ప్లేయర్లందరూ డొమెస్టిక్ క్రికెట్ పై కన్నేశారు. అలాగే జాతీయ జట్టులోకి పునారగమనం చేయాలని భావిస్తోన్న ప్లేయర్లూ ఈసారి దులీప్‌ ట్రోఫీకి సిద్ధమయ్యారు. యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్.. ఇలాంటి ప్లేయర్లు దులీప్‌ ట్రోఫీలో ఆడనున్నారు. శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రజత్‌ పటీదార్‌, దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్‌.. ఇలా జాతీయ క్రికెటర్లు రంగంలోకి దిగారు.

Read Also: Sikandar Raza: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. జింబాబ్వే స్టార్ సికిందర్ రజాకు తొలిస్థానం

స్టార్ ప్లేయర్లు..

జాతీయ జట్టులోకి రావాలని బలంగా కోరుకుంటున్న శ్రేయస్‌ అయ్యర్‌ కూడా తన సత్తా ఏంటో బీసీసీఐ పెద్దలకు చూపించాలని ఎదురుచూస్తున్నాడు. అందుకు ఇదే సరైన వేదిక ఇదేననేది అతడి భావన. పంజాబ్ కింగ్స్ తరఫున గత ఐపీఎల్ సీజన్‌లో భారీగా పరుగులు చేసినా అతడిని ఆసియా కప్‌లోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి రాణించి సెలక్టర్లను ఆకర్షించాలని చూస్తున్నాడు. మరోవైపు శార్దూల్‌ ఠాకూర్‌ తన ఫామ్‌ అందుకోవాలని చూస్తున్నాడు. శార్దూల్ నాయకత్వంలోనే వెస్ట్‌జోన్ సారథి ఆడనుండటం గమనార్హం. టెస్టుల్లోకి రావాలని ఎదురు చూస్తోన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ ఈసారి ఛాన్స్‌ను మిస్‌ కావద్దని బలంగా కోరుకుంటున్నాడు. భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ ఆడగలిగే సత్తా ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా ఇక్కడ హాట్‌ టాపిక్‌. వీరంతా రాణిస్తే తప్పకుండా బీసీసీఐ సెలక్టర్లు దృష్టి పెట్టాల్సిందే. జాతీయ జట్టులోకి తీసుకొనేందుకు అవకాశాలను పరిశీలించాల్సిందే.

 Read Also: Pakistan: వరస్ట్ ఫీల్డింగ్.. పాక్ ఖాతాలో మరో చెత్త రికార్డు..!

దులీప్ ట్రోఫీ షెడ్యూల్‌

బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు చెందిన మైదానాల్లో రెండు మ్యాచులు జరుగుతాయి. సౌత్‌ జోన్‌తో నార్త్‌ జోన్, వెస్ట్‌ జోన్‌తో సెంట్రల్ జోన్ తలపడతాయి. గురువారం నుంచి ఆదివారం వరకు జరిగే ఈ పోరు ప్రతి రోజు ఉదయం 9.30 గంటలకు మొదలు కానుంది. ఈ మ్యాచులకు లైవ్‌ స్ట్రీమింగ్‌ లేదు. ఇందులో గెలిచిన జట్టు సెప్టెంబర్ 11 నుంచి మొదలయ్యే ఫైనల్‌లో టైటిల్‌ కోసం బరిలోకి దిగుతాయి. తుది పోరును ప్రత్యక్షప్రసారం చేసేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad