Thursday, December 12, 2024
HomeఆటEmmiganuru: బీవీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Emmiganuru: బీవీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

గత వైసిపి ప్రభుత్వం క్రీడలను కూడా రాజకీయం చేసిందని కనీసం క్రీడలు జరుపుకోవడానికి మైదానాలను కూడా ఇవ్వలేదని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రజా పద్దుల కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక వీవర్స్ కాలని గ్రౌండ్ లో బీవీ స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ను బీవీ జయ నాగేశ్వర రెడ్డి ప్రారంభించారు.

- Advertisement -

8 ఏళ్లుగా టోర్నమెంట్స్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు శ్రీ నీలకంటేశ్వర స్వామి జాతర జనవరి 15 న జరుగుతుంది. జాతర సందర్భంగా మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం గత 8 ఏళ్లుగా క్రికెట్ తోపాటు ఫుట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, టెన్నిస్ టోర్నమెంట్ జరుపుతున్నామన్నారు. నేటి నుంచి జనవరి 15 వ తేదీ వరకు జరిగే టోర్నమెంట్ కు 136 జట్లు పాల్గొంటున్నాయి. టిడిపి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతిభ ఉన్న వారిని గుర్తించి సహకారం అందిస్తామన్నారు.

కార్యక్రమంలో టిడిపి నాయకులు, బీవీ స్మారక టోర్నమెంట్ నిర్వాహకులు ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి, రామకృష్ణ నాయుడు, రామదాసు గౌడ్, మిఠాయి నరసింహులు, పార్ల పల్లి మల్లికార్జున, మాచాని శివ శంకర్, మచాని శివకుమార్, రంగస్వామి గౌడ్, యు కేబీ వీరేంద్ర, బంద నవాజ్, నజీర్ అహ్మద్, కాశీమ్ వలి ,అంబేత్కర్, ధర్మాపురం గోపాల్, సురేష్ చౌదరి, కృష్ణ తేజ నాయుడు, దోమ భీమేష్, సోగనూరు జగదీష్, రాఘవేంద్ర, భార్గవ్,శంకర్ గౌడ్,జహీర్ , అమాన్, వహీద్, మల్లయ్య, ఇసాక్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News