Tuesday, September 10, 2024
HomeఆటEmmiganuru: నవోదయలో ప్రాంతీయ పోటీలు

Emmiganuru: నవోదయలో ప్రాంతీయ పోటీలు

ప్రారంభించిన సిఐ మోహన్ రెడ్డి

ఎమ్మిగనూరు మండలం బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆగస్టు 12 వ తేదీ నుండి 14 వ తేదీ వరకు జరిగే ప్రాంతీయ స్థాయి తాడు దాటవేయడం క్యాంపు(బాల,బాలికల) పోటీల ను సిఐ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాల నుంచి 22 నవోదయ విద్యాలయాల నుండి 141 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ (అల్యూమిని, నవోదయ అనంతపూర్) విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి, క్రీడల ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులందరూ దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

- Advertisement -

అనంతరం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ పద్మావతి మాట్లాడుతూ రీజినల్ లెవెల్ రోప్ స్కిప్పింగ్ 3 విభాగాలుగా విభాగించారు. అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాలుగా విభజించి వారిలో ప్రతిభను వెలికి తీస్తారు. దీనిలో 3 భాగాలుగా పరీక్షిస్తారు మొదట వేగము (30 సెకండ్లు), రెండవది డబల్ అండర్ (30 సెకండ్లు), మూడవది ఎండ్యూరెన్స్ (3 నిముషాలు) ఉంటుంది. ఇక్కడ మొత్తం 30 మందిని జాతీయ స్థాయికి (కేటగిరీ లో 10 మందిని) ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన విద్యార్థులందరికీ 15 రోజుల పాటు మా విద్యాలయంలో శిక్షణ ఇచ్చి కర్ణాటక లోని హాసన్ సెప్టెంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయిలో పోటీ లో పాల్గొంటారని విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ పద్మావతి తెలిపారు. ఇండియన్ రోప్ స్కిప్పింగ్ ఫెడరేషన్ టెక్నికల్ అధికారులు న్యాయ నిర్ణయితలుగా సాగర్, నిరంజన్, చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారు.


ఈ కార్యక్రమంలో విద్యాలయ వైస్-ప్రిన్సిపాల్ కె. చంధీరన్,ఎ.కె. బసవరాజ్, ఎర్రిస్వామి, శ్రీలక్ష్మి, జగన్నాథ్,శిరీష,శ్రీనివాసరావు,వెంకటేష్,అంజలి, నబీ విద్యాలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News