HomeఆటFaf du Plessis: పాకిస్థాన్ లీగ్‌ కోసం ఐపీఎల్‌ను వదులుకున్న డుప్లెసిస్.. మళ్ళీ వస్తానంటూ ఎమోషనల్...

Faf du Plessis: పాకిస్థాన్ లీగ్‌ కోసం ఐపీఎల్‌ను వదులుకున్న డుప్లెసిస్.. మళ్ళీ వస్తానంటూ ఎమోషనల్ పోస్ట్

Faf du Plessis Pulls Out of IPL 2026 Auction for PSL: భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా ఐపీఎల్ లవర్స్‌కు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేసిన ఈ సీనియర్ బ్యాటర్, రాబోయే మెగా వేలం (IPL 2026 Auction)లో తన పేరు నమోదు చేసుకోవడం లేదని అధికారికంగా ప్రకటించాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడిని రిటైన్ చేసుకోకుండా వదిలేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న వేలానికి దూరంగా ఉంటూ, పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు ఫాఫ్ తెలిపాడు.

- Advertisement -

ALSO READ: Rohit Sharma: హిట్‌మ్యాన్ విధ్వంసం.. 3 మ్యాచ్‌లలో 11 రికార్డులు

14 ఏళ్ల ప్రయాణం.. ఎమోషనల్ నోట్

శుక్రవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫాఫ్ ఈ విషయాన్ని పంచుకున్నాడు. “ఐపీఎల్‌లో 14 సీజన్లు పూర్తి చేసుకున్న తర్వాత, ఈ ఏడాది వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇది చాలా పెద్ద నిర్ణయం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ లీగ్ నా ప్రయాణంలో అతిపెద్ద భాగం. అద్భుతమైన జట్లతో, ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడే అవకాశం దక్కింది. భారతదేశం నాకు ఎన్నో స్నేహాలను, జీవిత పాఠాలను, మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. ఇక్కడి అభిమానుల ప్రేమ వెలకట్టలేనిది” అని ఫాఫ్ భావోద్వేగంతో రాసుకొచ్చాడు.

రిటైర్మెంట్ కాదు.. కొత్త సవాల్ కోసమే!

అయితే ఐపీఎల్‌కు తను పూర్తిగా గుడ్ బై చెప్పడం లేదని ఫాఫ్ స్పష్టం చేశాడు. “ఇది కచ్చితంగా వీడ్కోలు కాదు.. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను” అని అభిమానులకు మాటిచ్చాడు. ఈ బ్రేక్ తీసుకోవడానికి గల అసలు కారణాన్ని వివరిస్తూ.. కొత్త సవాళ్లను స్వీకరించాలనే ఉద్దేశంతోనే పీఎస్ఎల్‌ను ఎంచుకున్నట్లు తెలిపాడు. “కొత్త దేశం, కొత్త వాతావరణం, కొత్త ఛాలెంజ్.. ఈ ఏడాది పీఎస్ఎల్‌లో ఆడబోతున్నా. అక్కడ కూడా అద్భుతమైన టాలెంట్ ఉంది. పాకిస్థాన్ ఆతిథ్యాన్ని ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నా” అని 41 ఏళ్ల ఫాఫ్ తన ప్లాన్ వివరించాడు.

ALSO READ: MS Dhoni: పెళ్లంటే..నిప్పుతో చెలగాటమే..బ్రో!

గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..

ఐపీఎల్‌లో ఫాఫ్ రికార్డులు సామాన్యమైనవి కావు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల తరపున మొత్తం 154 మ్యాచ్‌లు ఆడాడు. 35.10 సగటుతో ఏకంగా 4,773 పరుగులు సాధించాడు. 2021లో చెన్నై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఫాఫ్, ఆర్సీబీకి మూడు సీజన్ల పాటు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2023లో ఆర్సీబీ తరపున 730 పరుగులతో దుమ్మురేపాడు. అయితే గత సీజన్‌లో ఢిల్లీ తరపున 9 మ్యాచ్‌ల్లో కేవలం 202 సగటుతో 202 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇప్పుడు పాక్ గడ్డపై తన బ్యాట్ ఝుళిపించేందుకు సిద్ధమయ్యాడు.

ALSO READ: WPL 2026: పాత గెలుపు గుర్రాలే కావాలి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News