Saturday, November 15, 2025
HomeఆటIND vs NZ: ముగిసిన తొలి రోజు ఆట.. మరోసారి నిరాశపరిచిన భారత ఆటగాళ్లు

IND vs NZ: ముగిసిన తొలి రోజు ఆట.. మరోసారి నిరాశపరిచిన భారత ఆటగాళ్లు

IND vs NZ| భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆటగాళ్లు మరోసారి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే తొలి రెండు టెస్టులు ఓడిపోయిన టీమిండియా.. మూడో టెస్టులోనూ తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ఆతిథ్య కివీస్ జట్టును 259 పరుగులకు ఆలౌట్ చేసి శభాష్ అనిపించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన.. బ్యాటింగ్‌లో అదే పేలవ తీరు కనబర్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులు మాత్రమే చేసింది.

- Advertisement -

దీంతో మరో 146 పరుగులు వెనుకంజలోనే ఉంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (18), విరాట్ కోహ్లీ (4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చివర్లో నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన మహ్మద్ సిరాజ్(0) కూడా ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్(31), రిషభ్ పంత్(1) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ రెండు వికెట్లు తీయగా, హెన్రీ ఒక వికెట్‌ పడగొట్టాడు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టును భారత్‌ స్పిన్నర్లు ఆది నుంచే కట్టడి చేశారు. ఓపెనర్లు లాథమ్‌ (28), కాన్వే (4) తక్కువ పరుగులకే ఔటయ్యారు. అయితే విల్‌ యంగ్‌ (71), మిచెల్‌ (81) మాత్రం క్రీజులో పాతుక్కుపోయి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. తర్వాత వీరిద్దరు ఔట్ కావడంతో మిగిలిన బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5, వాషింగ్టన్‌ సుందర్‌ 4 వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన జడేజా మరో ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో మొత్తం 314 వికెట్లు తీసి టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad