Faruque Ahmed hospitalised: బంగ్లా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఫరూఖ్ అహ్మద్ హార్ట్ ఎటాక్ బారినపడ్డాడు. ఆదివారం ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో అతడిని ఢాకాలోని ఆస్పత్రికి తరలించారు. ఫరూఖ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు కూడా కావడం గమనార్హం. 11 ఏళ్ల ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌లో అతడు ఆడింది కేవలం ఏడు వన్డేలు మాత్రమే.
క్రిక్‌బజ్ రిపోర్టు ప్రకారం, గుండెపోటుకు గురైన ఫరూఖ్ అహ్మద్ కు చికిత్స చేసిన వైద్యులు అతడి హార్ట్ లో బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడి గుండెకు సర్జరీ చేశారు. యాంజియోగ్రామ్ ద్వారా బ్లాకేజ్‌ను గుర్తించిన వైద్యులు ఆయన హార్ట్ లో స్టంట్ వేశారు. ప్రస్తుతం ఫరూఖ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
Also Read: IND vs AUS -చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. కంగారూ గడ్డపై ఐదో టీ20 సిరీస్ గెలిచి..
బంగ్లాదేశ్ తరపున ఫరూక్ అహ్మద్ 1984 నుండి 1999 వరకు బంగ్లాదేశ్ కు ప్రాతినిధ్యం వహించాడు. మెుత్తంగా ఏడు వన్డేలు ఆడిన అతను 15 పరుగుల సగటుతో 105 పరుగులు చేశాడు. ఇతడి అత్యధిక స్కోరు 57. 1988 అక్టోబర్ 29న పాకిస్తాన్‌పై వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫరూఖ్.. చివరిసారిగా 1999 మే 21న ఆస్ట్రేలియాపై ఆడారు. 1993-94లో అతడు బంగ్లా క్రికెట్ జట్టు కెప్టెన్ గా వ్యవహారించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ లో 5 మ్యాచులు ఆడిన ఫరూఖ్ 258 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 68 పరుగులు. ఇతడు రెండుసార్లు జాతీయ సెలెక్టర్ గా పనిచేశాడు.


