Saturday, November 15, 2025
HomeTop StoriesBCCI president: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్

BCCI president: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్

BCCI New President: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు ఎవరనేదానిపైన సస్పెన్స్ వీడింది. మొన్నటి వరకూ ఈ పదవిలో ఉన్న రోజర్ బిన్నీ స్థానంలో మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎంపికయ్యారు. ఆదివారం ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) 37వ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. దేశవాళీలో దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మిథున్ మన్హాస్‌ (Mithun Manhas) ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడకపోవడం గమనార్హం. 45 ఏళ్ల మన్హాస్‌ దిల్లీ తరఫున 157 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 130 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడాడు. అతడు 55 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. అయితే, ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడని వ్యక్తికి బీసీసీఐ చీఫ్ పదవి ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Read Also: Rithu Chaudhary: బొచ్చు కత్తిరించుకున్న రీతూ.. అడ్డడ్డే.. ఢమాల్ పవన్ ఎంత ఫీలయ్యాడో చూడండి

అపెక్స్ కౌన్సిల్లోకి ఇద్దరు

బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్షుడి పదవులతోపాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్ స్థానాలకు ఒకే ప్యానెల్‌ నామినేషన్‌ దాఖలు చేసింది. దీంతో మిథున్‌ మన్హాస్ అధ్యక్షుడు కాగా.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్‌ సైకియా మరోసారి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా ప్రభ్‌తేజ్‌ సింగ్‌ భాటియా, కోశాధికారిగా రఘురామ్‌ భట్‌ ఎన్నికైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అపెక్స్‌ కౌన్సిల్‌లో ఇప్పటి వరకు జయ్‌దేవ్‌ నిరంజన్‌ ఏక సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు మరో ఇద్దరిని బీసీసీఐ (BCCI) ఏజీఎం ఎంపిక చేసింది. ఐపీఎల్‌ ఛైర్మన్‌గా ఉన్న అరుణ్‌ ధుమాల్‌తోపాటు కైరుల్ జమాల్ మజుందార్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లోకి వచ్చారు. భారత్ – పాకిస్థాన్‌ జట్ల మధ్య ఆసియా కప్‌ ఫైనల్‌ నేటి రాత్రి 8 గంటలకు దుబాయ్‌లో ప్రారంభంకానుంది. అయితే, భారత క్రికెట్ బోర్డు నుంచి ఎవరూ దీనికి హాజరు కావడం లేదు. ఏజీఎం ఉండటంతోపాటు కొత్త కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరిస్తుండటంతో దుబాయ్‌ వెళ్లడం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత్ – పాకిస్థాన్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. అర్ధగంట ముందు అంటే 7.30 గంటలకు టాస్‌ వేస్తారు. ఈ మ్యాచ్‌ను సోనీ లివ్‌ ఓటీటీలోనూ, సోనీ స్పోర్ట్స్‌ ఛానళ్లలోనూ ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.

Read Also: Asia Cup final: దాయాదితో ఆఖరి పోరు.. వంద స్క్రీన్లలో లైవ్..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad