Former England batter Wayne Larkins Passes away: ఇంగ్లీష్ లెజండరీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 71 ఏళ్లు. ఆయన ఇంగ్లాండ్ తరపున 1979-91 మధ్య కాలంలో 13 టెస్టులు, 25 వన్డేలు ఆడారు. అంతేకాకుండా ఆయనకు ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్ లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. 85 సెంచరీలు, 182 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ రెండు ఫార్మాట్లలో కలిపే 40,736 పరుగులు సాధించారు. బ్యాటింగ్ తోపాటు బౌలింగ్ లోనూ సత్తా చాటారు వేన్. ఆయన 119 వికెట్లు తీశారు.
ఈ మాజీ క్రికెటర్ ను ముద్దుగా ‘నెడ్’ అని పిలుస్తారు. ఇతను 1979 ప్రపంచ కప్ ఫైనల్ ఆడాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడమే కాకుండా రెండు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. 1989-90 వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లాండ్ 1-0 లీడ్ సాధించడంలో ఇతడే కీలకపాత్ర పోషించాడు. అతను తన ఏడో టెస్టు ఆడటానికి ఎనిమిది సంవత్సరాలు టైమ్ పట్టింది. 1982లో అతనిపై మూడు సంవత్సరాలు నిషేధం విధించారు, లేకపోతే మరిన్ని మ్యాచులు ఆడే అవకాశం అతనికి లభించేది.
స్ట్రోక్‌ప్లేకు పెట్టింది పేరు అయిన నెడ్ తన కెరీర్ లో ఎక్కువ మ్యాచులు నార్తాంప్టన్‌షైర్ క్లబ్ తరపునే ఆడాడు. అతడు క్లబ్ తరపున 700 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. చివర్లో డర్హామ్‌కు ఆడాడు. మెుత్తంగా 85 సెంచరీలతో 40వేల పరుగులు చేసి తన కెరీర్ ను ముగించాడు. 2001లో ఇతను క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.