ఇంగ్లాండ్(England)తో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ టీమిండియా(India) ఆడనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ రాత్రి తొలి మ్యాచ్ జరగనుంది. ఇక రెండో టీ20 చెన్నైలోని చేపాక్ స్టేడియంలో శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(Tamilnadu Cricket Association) బంపర్ ఆఫర్ ప్రకటించింది. మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు వచ్చే ప్రేక్షకులకు మెట్రోలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లుగా తెలిపింది. మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుకోవాలని కోరింది.
కాగా 2023 ఐపీఎల్ సీజన్‌లోనూ చెన్నైలో జరిగిన మ్యాచ్‌లకు ఫ్రీ మెట్రో జర్నీని అందించింది. చెపాక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌లు కోల్పోయిన భారత జట్టు ఈ టీ20 సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది.