Saturday, November 15, 2025
HomeఆటAsia Cup final: దాయాదితో ఆఖరి పోరు.. వంద స్క్రీన్లలో లైవ్..!

Asia Cup final: దాయాదితో ఆఖరి పోరు.. వంద స్క్రీన్లలో లైవ్..!

Asia Cup Finals: ఆసియా కప్ ఫైనల్ పోరుకు సర్వసిద్ధమైంది. అయితే, ఫైనల్స్ లో భారత్- పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. పహల్గా ఉగ్రదాడి తర్వాత ఆ జట్టుతో మ్యాచ్‌లు కూడా ఆడొద్దని ‘బాయ్‌కాట్’ ట్రెండింగ్‌ నడిచింది. ఈ ఎడిషన్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఆశించనంత క్రేజ్ మాత్రం రాలేదు. అయితే, ఈ పది రోజుల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో.. మూడోసారి భారత్ – పాక్‌ తలపడనుండటంతో హైప్ వచ్చేసింది. ఇప్పటికే ఫైనల్‌ మ్యాచ్‌ కోసం దుబాయ్‌ స్టేడియంలోని సీట్లన్నీ అమ్ముడయ్యాయి. కాగా.. ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇలాంటి వేళ, ఈ మ్యాచ్‌ను లైవ్‌ ఇచ్చేందుకు పీవీఆర్‌ ఐనాక్స్‌ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 100 స్క్రీన్లలో లైవ్‌ ఇవ్వనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఐటీడబ్ల్యూ యూనివర్స్‌తో కలిసి పీవీఆర్‌ ఐనాక్స్‌ పనిచేయనుంది.

- Advertisement -

Read Also: How to boil Eggs: గుడ్లు ఉడికేటప్పుడు పగులుతున్నాయా.. ఈ సింపుల్ టిప్ లో సమస్య పరార్!

ఐనాక్స్ కీలక ప్రకటన

ఈ మేరకు పీవీఆర్ ఐనాక్స్ కీలక ప్రకటన చేసింది. ‘‘క్రికెట్ అభిమానులకు ఆసియా కప్‌ ఫైనల్‌ను మరింత చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. సెప్టెంబర్ 14న భారత్ – పాక్ మ్యాచ్‌ సందర్భంగా అద్భుతమైన వాతావరణం కనిపించింది. కొన్ని నగరాల్లోని సినిమా థియేటర్లు 90 శాతం ఆక్యుపెన్సీకి చేరాయి. క్రికెట్ అభిమానులు స్టేడియంలో ఉన్నట్లే ప్రతి క్షణం ఆస్వాదిస్తారు. ఇప్పుడు కూడా అలాగే గుర్తుండిపోయేలా ఐటీడబ్ల్యూ యూనివర్స్‌, ఆసియా క్రికెట్ కౌన్సిల్‌తో కలిసి ఎలాంటి యాడ్‌లు లేకుండా, స్టేడియం టు స్క్రీన్‌ అనుభవంతో లైవ్‌ ఇచ్చేందుకు 100 థియేటర్లను సిద్ధం చేశాం’’ అని పీవీఆర్‌ ఐనాక్స్‌ డిజిటల్ ప్రతినిధి ఆమీర్ బిజ్లి వెల్లడించారు.

Read Also: Viral Video: బాబోయ్.. మోకాళ్లపై కూర్చోబెట్టి.. కాళ్లతో తంతూ.. వీడియో వైరల్.. చివరిలో బిగ్ ట్విస్ట్

మ్యాచ్ ఎప్పుడంటే?

భారత్ – పాకిస్థాన్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. అర్ధగంట ముందు అంటే 7.30 గంటలకు టాస్‌ వేస్తారు. ఈ మ్యాచ్‌ను సోనీ లివ్‌ ఓటీటీలోనూ, సోనీ స్పోర్ట్స్‌ ఛానళ్లలోనూ ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. దుబాయ్‌ పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్‌ నెగ్గే జట్టు తొలుత బౌలింగ్‌ తీసుకొనే అవకాశాలు ఎక్కువ. మరి ఆసియా కప్‌ ఫైనల్‌లో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad