US Open 2025: యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌కు రంగం సిద్ధమైంది. అయితే, టెన్నిస్ గ్రాండ్ స్లామ్ కు భారత్ నుంచి పోటీపడే ప్లేయర్లు చాలా తక్కువమంది. లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా, యుకీ బాంబ్రి, రోహన్ బోపన్న లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా.. వీరంతా డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిళ్లను సొంతం చేసుకున్నవారే. కానీ, సింగిల్స్ మాత్రం ఇప్పటివరకూ ‘ఓపెన్’ టైటిల్‌ను దక్కించుకోలేదు. అయితే, ఇప్పుడు ‘యూఎస్’ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. అయితే, ఈ సారి సీనియర్లు బరిలో లేరు. కానీ, జూనియర్లు మాత్రం భారత్ తరఫున ఆడేందుకు రెడీ అయ్యారు. ఇక జూనియర్ స్థాయిలోనూ టైటిల్ నెగ్గి ఎప్పుడో 70ఏళ్ల పైన అయింది. 1954లో రామనాథన్ కృష్ణన్ జూనియర్ వింబుల్డెన్ జూనియర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు మరోసారి ‘జూనియర్లు’ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. దానికి కారణం యూఎస్ ఓపెన్ 2025 జూనియర్ విభాగంలో ఏకంగా ఆరుగురు తమ లక్ ని టెస్టు చేసుకోబోతున్నారు. అయితే, ఇందులో ఇద్దరు డైరెక్ట్ గా అర్హత సాధించారు. మరో నలుగురు క్వాలిఫై మ్యాచులు ఆడాలి. ఆగస్ట్ 31 నుంచి జూనియర్ యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది. ఆ ఇద్దరు ‘యువ’ కెరటాలపై ఓ లుక్కేద్దాం.
Read More: Immigration Policy: ట్రంప్ కఠిన వైఖరి.. 1960 తర్వాత భారీగా తగ్గిన వలసలు
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా..
యూఎస్ ఓపెన్ జూనియర్ విభాగంలో 16 ఏళ్ల మాయా రాజేశ్వరన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కోయంబత్తూర్‌కు చెందిన ఆమె మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. ఇంతకుముందు ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ 125 టోర్నీలో సెమీస్‌కు చేరుకుంది. సానియామీర్జా తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలిచింది. అలాగే ఫ్రెంచ్ ఓపెన్‌కు (జూనియర్) క్వాలిఫై విభాగంలో తొలి రౌండ్‌లో తలపడింది. వింబుల్డన్‌లోనూ క్వాలిఫయర్‌లో రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం ఆమె జూనియర్ గర్ల్స్ సింగిల్స్ విభాగంలో 55వ ర్యాంకులో ఉంది. సింగిల్స్‌లో మాయ నుంచి మెరుగైన ప్రదర్శనతోపాటు 72 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టాలనేది టెన్నిస్ అభిమానుల ఆకాంక్ష.
క్రిష్ త్యాగి..
కర్ణాటకకు చెందిన క్రిష్ త్యాగికి జూనియర్ విభాగంలో గొప్ప అనుభవం ఉంది. 18 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ ప్రస్తుతం 49వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇప్పటికే పలు జూనియర్ గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాలకు అర్హత సాధించాడు. ఇదే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్స్ టోర్నీకి డైరెక్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే, తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. అంతకుముందు వింబుల్డన్ జూనియర్స్‌లోనూ తలపడ్డాడు. కానీ, అక్కడా మొదటి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఇప్పుడు యూఎస్ ఓపెన్ పురుషుల జూనియర్స్ విభాగంలో ప్రధాన పోటీదారుగా నిలిచాడు. టెన్నిస్ అంటేనే పరుగులు పెడుతూ.. ప్రత్యర్థులను హడలెత్తించాలి. అయితే క్రిష్ కి కళ్లద్దాలు ధరించి ఆడటం అతడి స్పెషాలిటీ.
Read More: S Jaishankar: భారత్- పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం.. జైశంకర్ స్ట్రాంగ్ రిప్లయ్
మరో నలుగురు..
మరో నలుగురు ప్లేయర్లు కూడా యూఎస్ ఓపెన్ జూనియర్ సింగిల్స్ విభాగంలో క్వాలిఫై డా కోసం తపడుతున్నారు. హితేశ్ చౌహాన్, అర్జున్ రాఠీ, రెతిన్ ప్రణవ్ సెంథిల్ కుమార్, ఆర్నవ్ పాపర్కర్ క్వాలిఫై డ్రా కోసం పోటీ పడుతున్నారు. వీరిలో మెయిన్ డ్రాకు అర్హత సాధిస్తే నేరుగా అక్కడ ఆడేస్తారు.


