Smriti Mandhana wedding Rumours: టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ వివాహంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. స్మృతి తండ్రితోపాటు పెళ్లి కొడుకు పలాశ్ అనారోగ్యం పాలవడంతో పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి వివాహంపై సోషల్ మీడియాలో రకరకాల వదంతులు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది పలాశ్ తల్లి అమిత ముచ్చల్.
తాజాగా పలాశ్ తల్లి అమిత ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. స్మృతి, పలాశ్ ఇద్దరూ కష్టకాలంలో ఉన్నారని..వారిద్దరి వివాహం అతి త్వరలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. స్మృతి తండ్రి, పలాశ్ ప్రస్తుతం కోలుకున్నారు. అయితే పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి పలాష్ కానీ, స్మృతి కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
మరోవైపు స్మృతి తన సోషల్ మీడియా ఖాతా నుంచి పెళ్లికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను తొలగించడం.. ఇంకోవైపు పలాష్ యెుక్క కొన్ని స్క్రీన్ షాట్లు వైరల్ కావడంతో వీరిద్దరి బంధంపై నెట్టింట పలు ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ పాటికే స్మృతి-పలాష్ పెళ్లి జరిగిపోయేది.
Also Read: Jemimah – బిగ్ బాష్ లీగ్‌కు గుడ్ బై చెప్పిన జెమీమా..!
పెళ్లి రోజు కొన్ని గంటలకు ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ స్వల్ప గుండెపోటుతో బాధపడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పెళ్లి చేసుకోలేనని అందుకే వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆమె నిర్ణయం తీసుకున్నట్లు స్మృతి మేనేజర్ ప్రకటించారు. కాసేపటికే మంధానకు కాబోయే భర్త పలాశ్ సైతం అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా అతడిని ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకున్న అతడికి మూడు వారాలు విశ్రాంతి నివ్వాలని వైద్యులు సూచించారు.
మరోవైపు తన ఫ్రెండ్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్. ఈ క్లిష్ట సమయంలో అండగా ఉండేందుకు మహిళల బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పుకుంది. బ్రిస్బేన్ హీట్ తరుపున జెమీమా మిగిలిన నాలుగు మ్యాచులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

