Asia Cup 2025: ఆసియా కప్ ప్రకటన తర్వాత పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా అందరూ అనుకున్నట్లే వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఎంపికయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆసియా కప్ సభ్యుల ప్రకటన సందర్భంగా వెల్లడించిన తొలిపేరు కూడా గిల్ అవడం విశేషం. కానీ, వైస్ కెప్టెన్సీకి అగార్కర్ ఫస్ట ఛాయిస్ గిల్ కాదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఇలాంటి సమయంలో గిల్ పై అజిత్ అగార్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘‘శ్రీలంకతో సిరీస్‌లో గిల్ వైస్ కెప్టెన్‌గా చేశాడు. ఆ తర్వాత టెస్టుల్లో బిజీగా మారిపోయాడు. అతడిలోని నాయకత్వ లక్షణాలను మేం గమనిస్తూనే ఉన్నాం. ఇంగ్లాండ్‌లో జట్టును నడిపించిన తీరు.. అతడి ఫామ్ అందరికీ తెలిసిందే. తీవ్ర ఒత్తిడిలోనూ పరుగులు రాబట్టాడు. సారథిగా సిరీస్‌ను సమం చేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు’’ అని చెప్పుకొచ్చాడు.
Also Read: HIPSA: గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కబడ్డీ ప్రదర్శన
గత కొంతకాలంగా టీ20 సిరీస్ కే దూరంగా గిల్..
గతేడాది శుభ్‌మన్ గిల్ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కే దూరంగా ఉన్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సన్నద్ధత కోసం వైదొలిగాడు. ఇక స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ ఆడలేదు. చివరిసారిగా శ్రీలంకతో సిరీస్‌లో ఆడాడు. ఇప్పటివరకు కెరీర్‌లో 21 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన గిల్ 578 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read: India Post: మరింత స్మార్ట్ గా ఇండియా పోస్ట్..!
అక్షర్ కు ఓటేసిన అగార్కర్
సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా అక్షర్ పటేల్ మొన్నటివరకు పనిచేశారు. అయితే, మరోసారి అతడికి ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్ మెంట్ భావించింది. కానీ, మేనేజ్‌మెంట్ మరోసారి అతడికే అవకాశం ఇవ్వాలని తొలుత భావించింది. అయితే, చీఫ్ కోచ్ గౌతమ్‌గంభీర్ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందట. భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకుగాను గిల్‌కు ఇప్పుడు వైస్ కెప్టెన్సీ అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ భేటీలో గంభీర్ నేరుగా కాకుండా వర్చువల్‌గా పాల్గొన్నాడు. యంగ్ ప్లేయర్ గిల్‌ను ఎంపిక చేస్తే భవిష్యత్తుకు మంచిదనే అభిప్రాయం వ్యక్తంచేశాడు. దీంతో అందరూ ఏకీభవించి గిల్‌నే వైస్ కెప్టెన్‌గా చేశారు.


