Sunday, December 8, 2024
HomeఆటGarla: క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

Garla: క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

బాస్కెట్ బాల్ ..

క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఎస్ఐ జీనత్ కుమార్ లు అన్నారు. బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రాంగణంలో ఖమ్మం భద్రాది కొత్తగూడెం మహబూబాద్ జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ పోటీలను అసోసియేషన్ అధ్యక్షులు రామన్నతో కలిసి సీఐ రవికుమార్ ఎస్ఐ జీనత్ కుమార్ లు ప్రారంభించారు.

- Advertisement -

తొలుత పాల్వంచ గార్ల క్రీడాకారులకు ఇన్విటేషన్ మ్యాచ్ ను నిర్వహించారు. అనంతరం క్రీడాకారులకు కిట్లను పంపింణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువుతో సమానంగా క్రీడలలో రాణించి నప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. గ్రామీణ యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహద పడతాయన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అలవాల సత్యవతి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణ గౌడ్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు యలమ రెడ్డి కృష్ణారెడ్డి బాస్కెట్ బాల్ అసోసియేషన్ సభ్యులు నరసింహరావు జయశంకర్ శేఖర్ రాము గౌడ్ అలవాల పవన్ సుమంత్ ఎజాస్ రెడ్డి మల్ల ఉమేష్ రావుక ఆశిష్ జిల్లా నాగరాజు నరసింహారావు రాజశేఖర్ పట్టణ పుర ప్రముఖులు క్రీడాకారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News